రెండేళ్ల తర్వాత బెత్లెహేంలో వెలిగిన క్రిస్మస్ ట్రీ.. కానీ అంతలోనే ఇలా..
గాజా యుద్ధం మధ్య బెత్లెహెం రెండేళ్ల తర్వాత క్రిస్మస్ ట్రీని వెలిగించింది. పాలస్తీనియన్లలో ఆశ, ఆవేదనలు కలగలిసిన ఈ నిరాడంబర వేడుకలు కేవలం ప్రార్థనలకే పరిమితమయ్యాయి. గాజా విధ్వంసం స్థానికులను కలచివేసింది. పర్యాటకం తీవ్రంగా దెబ్బతినడంతో ఆర్థిక వ్యవస్థ కుదేలైంది. అయినప్పటికీ భవిష్యత్తుపై ఆశతో వేడుకలు కొనసాగాయి.
గాజాపై ఇజ్రాయెల్ యుద్ధం సృష్టిస్తున్న విధ్వంసం మధ్య, ఏసుక్రీస్తు జన్మస్థలమైన బెత్లెహేంలో రెండేళ్ల తర్వాత క్రిస్మస్ ట్రీ వెలుగులు విరజిమ్మింది. ఈ సంబరాలు పాలస్తీనియన్లలో ఒకేసారి ఆశను, ఆవేదనను నింపుతున్నాయి. ఈసారి క్రిస్మస్ వేడుకలను కేవలం మతపరమైన ప్రార్థనలు, సంప్రదాయాలకే పరిమితం చేశారు. మాంగర్ స్క్వేర్‌లో స్థానిక అధికారులు, చర్చి పెద్దల సమక్షంలో నిరాడంబరంగా క్రిస్మస్ ట్రీని వెలిగించారు. ఈ కార్యక్రమానికి వేలాదిగా తరలివచ్చిన ప్రజలు ప్రార్థన గీతాలు ఆలపించారు. గాజాలో జరుగుతున్న విధ్వంసం, మరణాల కారణంగా వేడుకల్లో ఆనందం కన్నా విషాదమే ఎక్కువగా కనిపిస్తోందని స్థానికులు వాపోతున్నారు. ఈ సందర్భంగా “ఈ వేడుకలు మునుపటిలా లేవు. మా హృదయాల్లో గాజా విషాదం నిండి ఉంది. అయినా, ఈ కష్టకాలంలోనూ మేం జీవించాలని ఆశిస్తున్నాం. బెత్లెహేం క్రిస్మస్ రాజధానిగా నిలవాలనే సందేశాన్ని ప్రపంచానికి పంపుతున్నాం” అంటూ ఎవాంజెలికల్ లూథరన్ చర్చి ఫాదర్ ముంథర్ ఐజాక్ తెలిపారు. “చీకటిని పారదోలి ప్రజల్లో ఆశను నింపేందుకే ఈ కార్యక్రమం చేపట్టాం. పోప్ లియో-14 కూడా బెత్లెహేం ప్రజల కోసం ప్రార్థిస్తున్నట్లు సందేశం పంపారు” అంటూ బెత్లెహేం మేయర్ సందేశమిచ్చారు. ఇజ్రాయెల్ ఆంక్షల కారణంగా బెత్లెహేంలో పర్యాటక రంగం పూర్తిగా కుదేలైంది. దీంతో స్థానిక ఆర్థిక వ్యవస్థ తీవ్రంగా దెబ్బతింది. ఆదాయం లేకపోయినా, రాబోయే రోజుల్లో అంతా మంచే జరుగుతుందన్న ఆశతోనే వ్యాపారులు కాలం వెళ్లదీస్తున్నారు. ఇజ్రాయెల్‌లోని పాలస్తీనియన్లను బస్సుల్లో ఇక్కడికి రప్పించి స్థానిక పర్యాటకాన్ని ప్రోత్సహించేందుకు బెత్లెహేం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రయత్నిస్తోంది. అయినప్పటికీ విదేశీ పర్యాటకుల రాక లేకపోవడంతో హోటళ్లలో ఆక్యుపెన్సీ కేవలం 20 శాతంగానే ఉంది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ప్రాణాలు తీసిన ప్రీ వెడ్డింగ్ షూట్.. నవ జంట దుర్మరణం
TOP 9 ET News: ఖండ-2 రిలీజ్ డేట్ ఫిక్స్? గెట్ రెడీ
Rajasekhar: రాజశేఖర్‌కు షూటింగ్ లో ప్రమాదం.. డి కాలికి తీవ్ర గాయం
దివ్వెల మాధురిపై రీతూ తల్లి సెటైర్లు.. అబద్దాలు ఆడితే ఇలానే ఉంటది
