old woman arrest: ఇదో సరదా మరి.. అడిగి మరీ అరెస్టయింది.! ఎందుకో తెలుసా..

Updated on: Aug 30, 2022 | 8:47 AM

వందేళ్ల బామ్మ జీన్‌ బికెంటన్‌ ఆస్ట్రేలియాలో కొన్నేళ్లుగా వీల్‌చైర్‌కే పరిమితమైంది. తమ వారితో తన వందో పుట్టినరోజు వేడుకలు ఫుల్‌ జోష్‌గా జరుపుకుంటోంది. ఉన్నట్టుండి పోలీసులు రంగప్రవేశం చేశారు.


వందేళ్ల బామ్మ జీన్‌ బికెంటన్‌ ఆస్ట్రేలియాలో కొన్నేళ్లుగా వీల్‌చైర్‌కే పరిమితమైంది. తమ వారితో తన వందో పుట్టినరోజు వేడుకలు ఫుల్‌ జోష్‌గా జరుపుకుంటోంది. ఉన్నట్టుండి పోలీసులు రంగప్రవేశం చేశారు. అందరూ చూస్తుండగా ఆమెను అదుపులోకి తీసుకున్నారు. సంకెళ్లు వేసి మరీ తీసుకెళ్లారు. కానీ, షాకవ్వాల్సింది పోయి బామ్మ చప్పట్లు కొడుతూ సంబరపడిపోయింది. పైగా ఆహూతులంతా ఆమెతో శ్రుతి కలిపారు. ఎందుకంటారా? ఎందుకంటే జరిగింది ఉత్తుత్తి అరెస్టే కాబట్టి. అసలు సంగతేమిటంటే జీవితంలో ఒక్కసారైనా అరెస్టు కావాలన్నది ఈ బామ్మ చిరకాల వాంఛ. తర్వాత అంతా కలిసి ఇలా ఫొటోలు దిగి సందడి చేశారు. విక్టోరియా పోలీసు శాఖ ఫేస్‌బుక్‌లో పోస్ట్‌ చేసింది. ఇది కమ్యూనిటీ పోలీసింగ్‌కు అద్దం పట్టిందంటూ కామెంట్లు వస్తున్నాయి. పుట్టిన రోజునాడు పెద్దావిడకు గొప్ప కానుక ఇచ్చారంటూ కొందరు మెచ్చుకున్నారు. ఈ బామ్మ ఆర్మీలో నర్సుగా సుదీర్ఘకాలం పని చేసి రిటైరయ్యారట. తన చిరకాల కోరికను సెకండ్‌ ఇన్నింగ్స్‌లో మొత్తానికిలా తీర్చుకున్నారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Shocking Video: మూడుసార్లు కాటేసినా.., తగ్గలే అంటూ పామును ఎలా పట్టుకున్నాడో మీరే చూడండి..

Groom Cake Viral: వీడేం పెళ్ళికొడుకు.. వరుడికి చిర్రెత్తుకొచ్చింది.. అందరూ చూస్తుండగానే ఒక్కసారిగా..!

Published on: Aug 30, 2022 08:47 AM
Loading...
Unable to load recommendations.
Follow Us