దీనిపై నెటిజన్లు రకరకాల కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియోలో ఓ వ్యక్తి తన ఇంటి బయట కుర్చీలో కూర్చుని ఫోన్ చూసుకుంటాడు. ఈ సమయంలో ఉన్నట్టుండి ఊహించని ఘటన చోటు చేసుకుంటుంది. ఇద్దరు యువకులు.. ఓ పెద్ద ప్లాస్టిక్ పైపు పట్టుకుని అక్కడికి వచ్చారు. కుర్చీలో కూర్చున్న వ్యక్తికి ఎదురుగా నిలబడి పైపును అతడి వైపు గురి పెట్టారు. ప్లాస్టిక్ పైపుతో ఏం చేస్తున్నారబ్బా.. అని ఆలోచించే లోపే.. ఆ పైపులో దీపావళి రాకెట్‌ను పెట్టి నిప్పు అంటిస్తారు. దీంతో రాకెట్ నేరుగా కుర్చీలో కూర్చున్న వ్యక్తిని తాకింది. రాకెట్ దూసుకురావడంతో ఒక్కసారిగా షాక్ అయిన ఆ వ్యక్తి వెంటనే పైకి లేచి లుంగీ విదిలించుకుంటూ ఒకటే గంతులు. ఇంతలో ఈ యువకులు అక్కడినుంచి జంప్ . అయితే ఇదంతా వారు కావాలనే ఇలా చేసినట్లు అనిపిస్తోంది. అయినా వీడియో మాత్రం సోషల్ మీడియాలో తెగ హల్‌చల్ చేస్తోంది. ఈ వీడియోపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘వామ్మో.. వీళ్లేంట్రా.. ఇలా తయారయ్యారు’’.. అంటూ కొందరు, ‘‘ఇలాంటి పనులు చేయడం చాలా ప్రమాదం’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియోను ఒకటిన్నర మిలియన్లమందికి పైగా వీక్షించారు. 6 వేలమందికి పైగా లైక్ చేశారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
LPG Gas Cylinder: ఏపీలో ఉచిత గ్యాస్ సిలిండర్లను ఎలా పొందాలంటే ??
Sai Pallavi: బాలీవుడ్ గురించి సాయిపల్లవి సంచలన కామెంట్స్
నవంబర్ 2024లో బ్యాంక్ సెలవులు.. దాదాపు సగం రోజులు తాళాలే !!
కొన్ని గంటల్లో పెళ్లి.. వరుడికి ఊహించని ట్విస్ట్ ఇచ్చిన వధువు