Viral: ఒంటికి టవల్ చుట్టుకుని మెట్రోరైలు ఎక్కిన యువతులు.! వీడియో వైరల్..
సోషల్ మీడియా పుణ్యమా అనిరైళ్లలో చిత్రవిచిత్ర విన్యాసాలు చేయడం ఇటీవల పరిపాటిగా మారింది. నెటిజన్ల దృష్టిలో పడేందుకు యువకులు రకరకాల స్టంట్లు వేస్తూ ఉంటారు. అయితే ఇప్పుడు మేమేమీ తక్కువా అంటూ యువతులు కూడా యువకులతో పోటీ పడుతున్నారు. యువతులకు సంబంధించిన ఓ వీడియో ఒకటి తాజాగా నెట్టింట చక్కర్లు కొడుతోంది. కొందరు యువతులు టవల్ కట్టుకుని మెట్రో రైలు ఎక్కేశారు. సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది.
నలుగురు యువతులు ఒంటిపై టవల్స్ మాత్రమే ధరించి బయటికి వస్తారు. బయటికి రావడమే కాకుండా ఏకంగా రైల్వే స్టేషన్‌కు వెళ్లి మెట్రో రైలు ఎక్కేస్తారు. వారు ఇలా టవల్స్‌తో రైలు ఎక్కడం చూసి లోపల ఉన్న వారంతా ఒక్కసారిగా అవాక్కవుతారు. అయినా ఎవరూ నోరు మెదపకుండా అలాగే మిన్నకుండిపోతారు. లోపలికి వెళ్లిన వారు ఖాళీగా ఉన్న సీట్లలో కూర్చుండిపోతారు. కొందరు వారిని ఆసక్తిగా చూస్తుండిపోతారు. ఇంకొందరు వారితో ఫొటోలు కూడా తీసుకుంటారు. వారు కూడా ఏమాత్రం సిగ్గుపడకుండా వివిధ రకాలుగా ఫోజులు ఇస్తూ అందరితో ఫొటోలు దిగుతారు. ఇళా రైల్లో హల్‌చల్ చేసిన ఈ యువతులు తర్వాత మరో రైల్లోకి వెళ్లిపోతారు. వీరి విచిత్ర నిర్వాకానికి అక్కడున్న వారంతా ఒక్కసారిగా అవాక్కవుతారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!
Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!
Leaves: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.