హీరోలాగా బైక్ పై స్టంట్ చేయాలనుకున్నాడు.. దెబ్బకు దిమ్మతిరిగిపోయింది..

|

Aug 12, 2022 | 9:38 AM

ప్రస్తుతం సోషల్ మీడియా పిచ్చితో యువతలో స్టంట్స్ క్రేజ్ బాగా పెరిగిపోయింది. ప్రాణాలకు రిస్క్ అని తెలిసికూడా ప్రమాదకరమైన స్టంట్స్ చేస్తున్నారు.

ప్రస్తుతం సోషల్ మీడియా పిచ్చితో యువతలో స్టంట్స్ క్రేజ్ బాగా పెరిగిపోయింది. ప్రాణాలకు రిస్క్ అని తెలిసికూడా ప్రమాదకరమైన స్టంట్స్ చేస్తున్నారు. ముఖ్యంగా టీనేజర్స్ నడి రోడ్డుపై సాహసాలు చేస్తూ ప్రాణాలు పొగోట్టుకుంటున్నారు. ఎలాంటి స్టంట్ చేయాలన్నా ప్రాక్టీస్ చాలా అవసరం. అలాగే నిపుణుల సమక్షంలోనే స్టంట్స్ చేయాలి. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోకుండా స్టంట్స్ చేస్తే చిన్న పొరపాటు జరిగినా ప్రాణాల మీదకు వస్తుంది. తాజాగా అలాంటి ఓ వీడియో ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతుంది. ఈ వీడియోలో ఓ యువకుడు నడిరోడ్డుపై తన బైక్ తో స్టంట్ చేశాడు. కానీ చిన్న పొరపాటుతో స్టంట్ ఫెయిల్ అయ్యి రోడ్డుపై పడిపోయాడు. హెల్మె్ట్ ధరించిన యువకుడు బైక్ పై కూర్చోకుండా ముందు చక్రాలను గాలిలోకి ఎత్తి బైక్ నడుపుతన్నాడు. ఈ క్రమంలోనే బైక్ స్పీడ్ ఎక్కువ కావడంతో కంట్రోల్ తప్పాడు. దీంతో పక్కనే ఉన్న మరో కారును బలంగా ఢీకొట్టి కింద పడిపోయాడు. తలపై హెల్మెట్ ఉండడంతో బతికి బయటపడ్డాడు. ఈ వీడియోను ట్విట్టర్ ఖాతాలో షేర్ చేయగా లక్షల మంది చూశారు. దీనిపై పలు రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Adolf Hitler Watch: వేలం పాటకు హిట్లర్ వాచ్.. ఎంత ధర పలికిందో తెలిస్తే !!

పురుషులు ఈ పండ్లు తింటే ఆ సమస్యలన్నీ మటుమాయం !!

గర్ల్‌ఫ్రెండ్‌ని ఇంప్రెస్‌ చేద్దామనుకున్నారు.. జైల్లో కూర్చున్నారు

Published on: Aug 12, 2022 09:38 AM