Bike: వారెవ్వా.! బైక్ అదుర్స్ కదూ.! పెట్రోల్ లేకుండానే పరుగులు పెడుతున్న బైక్..!

|

Apr 01, 2023 | 9:16 PM

పెట్రో, డీజిల్ ధరలు సామాన్యుడికి చుక్కలు చూపిస్తున్నాయి. రోజురోజుకి పెరుగుతున్న ధరల కారణంగా ప్రజలు అవస్థలు పడుతున్నారు. ఇప్పుడే ఇలా ఉంటే రానున్న రోజుల్లో ఎలా ఉంటుందోనని ఆందోళన చెందుతున్నారు.

పెట్రో, డీజిల్ ధరలు సామాన్యుడికి చుక్కలు చూపిస్తున్నాయి. రోజురోజుకి పెరుగుతున్న ధరల కారణంగా ప్రజలు అవస్థలు పడుతున్నారు. ఇప్పుడే ఇలా ఉంటే రానున్న రోజుల్లో ఎలా ఉంటుందోనని ఆందోళన చెందుతున్నారు. పెట్రోల్ రేట్లను తట్టుకోలేక చాలా మంది బైక్‌లను పక్కన పెట్టి ప్రజా రవాణా వ్యవస్థనే ఆశ్రయిస్తున్నారు. ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న ఓ వీడియో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఆ బైక్ నడపడానికి పెట్రోల్ అవసరం లేదట. అంతేకాదు బైక్‌లోని ప్రతి పార్టును చెక్కతో తయారు చేశారు. బ్యాటరీతో నడిచే ఈ బైక్ అచ్చం చూడడానికి బుల్లెట్‌లాగే కనిపిస్తోంది. స్టార్ట్ చేస్తే గానీ బుల్లెట్ సౌండ్‌ వినిపిస్తుంది. ఇక్కడ విశేషం ఎమంటే బైక్ ట్యాంక్, సైలెన్సర్‌ను కూడా చెక్కతోనే తయారు చేశారు. ఇక పెట్రోల్ ట్యాంకులో మంచి మ్యూజిక్ సిస్టమ్‌ను అమర్చారు. ఆ బైక్‌ను చూసి చాలా మంది షాక్ అవుతున్నారు. అతడి ప్రతిభపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇలాంటి బైక్ అందుబాటులోకి వస్తే చాలా మంది కష్టాలు తీరిపోతాయని ఒక వ్యక్తి కామెంట్ చేశారు. కాగా, ఆ బైక్ సమర్థతపై కొందరు అనుమానాలు వ్యక్తం చేశారు. ఎదైతేనేం.. ఇలాంటి బైక్‌ మార్కెట్‌లోకి తీసుకురావాలని ఆకాంక్షిస్తున్నారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Jr.NTR – Ram Charan: కనిపించని దోస్తాన్.! చెర్రీ బర్త్‌డేకి ఎన్టీఆర్ ఎందుకు రాలేదు..?

Viral Video: రూ.80 లక్షలు ఇస్తానన్నా ఆమె ఒప్పుకోలేదు..

Rashmika Mandanna: ఇక ఆ డ్యాన్స్ చేయ‌ను..! నెటిజన్ ప్రశ్నకు రష్మిక సమాధానం..

Published on: Apr 01, 2023 09:16 PM