Woman Stunt: విమానంలో మహిళ చేసిన పనికి అంతా షాక్‌.. వైరల్‌ అవుతున్న అమేజింగ్‌ వీడియో..

|

May 21, 2022 | 8:57 AM

సోషల్ మీడియాలో నిత్యం ఎన్నో రకాల వీడియోలు వైరల్ అవుతుంటాయి. తాజాగా ఓ మహిళకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఇటీవల ఇంటర్నెట్‌లో పాపులర్‌ అయ్యేందుకు కొందరు రకరకాల స్టంట్స్‌ చేస్తున్నారు.


సోషల్ మీడియాలో నిత్యం ఎన్నో రకాల వీడియోలు వైరల్ అవుతుంటాయి. తాజాగా ఓ మహిళకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఇటీవల ఇంటర్నెట్‌లో పాపులర్‌ అయ్యేందుకు కొందరు రకరకాల స్టంట్స్‌ చేస్తున్నారు. కొంతమంది ఎలాంటి స్టంట్లు చేయకుండానే.. వైరల్ అవుతుంటారు. సాధారణంగా ఎవరైనా దూర ప్రాంతాలకు ప్రయాణం చేసేటప్పుడు లగేజ్‌ తీసుకెళ్తుంటారు. కొందరు వ్యక్తులు మల్టీ టాస్కింగ్‌లో వారి పనులను వారే సొంతంగా చేసుకుంటారు.. అంటే వాళ్ల లగేజ్‌ వాళ్లే తీసుకెళ్తుంటారు. అలాంటి ఓ ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట వైరల్‌ అవుతోంది. విమానంలో ఓ మహిళ తన చిన్నారి పాపతో ప్రయాణిస్తూ వచ్చింది. ఇక తను విమానం దిగాల్సిన టైమొచ్చింది. దాంతో ఓ పక్క చిన్నారిని ఎత్తుకుని, మరో చేత్తో విమానంలోని ఓవర్‌హెడ్‌ క్యాబిన్‌ నుంచి తన సూట్‌ కేసు తీసుకుంది. ఇంత వరకూ బాగానే ఉంది. ఇప్పుడు ఆ ఓపెన్‌ చేసిన క్యాబిన్‌ మూసివేయాలి. తనకు అక్కడ సాయం చేసేవాళ్లు కూడా ఎవరూ లేరు. ఎలా… అయితే ఆ మహిళ ఏం చేసిందో తెలుసా.. ఆమె కుడి కాలును జిమ్నాస్ట్ లాగా పైకెత్తి ఓవర్ హెడ్ క్యాబిన్ తలుపును మూసేసింది. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌ అవుతోంది. ఈ వీడియో చూసి ఆ మహిళ చేసిన పనికి అందరూ ఆశ్చర్యపోతున్నారు. వాటే స్టంట్‌ అంటూ కామెంట్‌ చేస్తున్నారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Wife Permission: మీరు మద్యం తాగాలంటే భార్య అనుమతి తప్పనిసరి.. అసలు విషయం తెలిస్తే మైండ్ బ్లాంకే.!

killer lady: భర్తకు తెలియకుండా ఇద్దరితో అఫైర్.. ఆ తర్వాత ఓ మర్డర్.. సినిమాను మించిన సస్పెన్స్..

Mango tips: మామిడి పండ్లు సహజంగా పండినవా.. కెమికల్ వేసి పండించారా.. ఇలా గుర్తించండి.!

Published on: May 21, 2022 08:57 AM