సూరత్ మహిళ వింత దొంగతనం.. యజమాని షాక్!

Updated on: Jun 23, 2026 | 8:08 PM

గుజరాత్‌లోని సూరత్‌లో జరిగిన ఓ వింత దొంగతనం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఒక మహిళ దొంగిలించిన సైకిల్‌ను మరుసటి రోజే తిరిగి తీసుకొచ్చి యజమాని ఇంటి వద్ద ఉంచింది. అనంతరం సీసీటీవీ కెమెరా వైపు తిరిగి నమస్కరిస్తూ క్షమాపణలు కోరింది. ఈ ఘటన నెటిజన్లను ఆశ్చర్యానికి గురిచేస్తూ విభిన్న స్పందనలను రాబడుతోంది.

గుజరాత్‌లోని సూరత్ నగరంలో ఒక వింత దొంగతనం జరిగింది. సాధారణంగా దొంగతనానికి గురైన వస్తువులు తిరిగి దొరకడం చాలా అరుదు, కానీ ఇక్కడ ఒక మహిళ తాను దొంగిలించిన సైకిల్‌ను మరుసటి రోజే యజమానికి తిరిగి ఇచ్చేసింది. అంతేకాకుండా, అక్కడే ఉన్న నిఘా కెమెరా వైపు చూస్తూ రెండు చేతులూ జోడించి నమస్కరిస్తూ క్షమాపణలు కోరింది. ఆ వీడియో విపరీతంగా వైరల్ అవుతోంది. జూన్ 12న సదరు మహిళ ఒక ఇంటి ప్రాంగణంలో నిలిపి ఉంచిన సైకిల్‌ను దొంగిలించింది. సైకిల్ పోయిందని యజమాని దానిపై ఆశలు వదులుకున్నాడు. అయితే, అందరినీ ఆశ్చర్యపరుస్తూ మరుసటి రోజు ఆ మహిళ అదే సైకిల్‌ను తీసుకుని మళ్లీ ఆ ఇంటికి వచ్చింది. ఎంతో జాగ్రత్తగా ఆ సైకిల్‌ను అదివరకు ఎక్కడ ఉందో అదే స్థానంలో తిరిగి నిలిపింది. ఆ తర్వాత నేరుగా అక్కడే ఉన్న కెమెరా వైపు తిరిగి, నమస్కరిస్తూ తన తప్పును క్షమించమని కోరుతూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఈ మొత్తం ఉదంతం అక్కడ ఉన్న నిఘా కెమెరాలో స్పష్టంగా రికార్డు అయింది. మొదట దొంగతనం చేయడం, ఆపై పశ్చాత్తాపంతో వస్తువును తిరిగి తెచ్చి క్షమాపణలు కోరిన వీడియో క్లిప్ ఇన్‌స్టా, ఫేస్‌బుక్ లో హల్‌చల్ చేస్తోంది. దీనిని చూసిన నెటిజన్లు ఆమెను ‘సంస్కారవంతమైన దొంగ’ అంటూ రకరకాల కామెంట్లు పెడుతున్నారు. తప్పును తెలుసుకుని సరిదిద్దుకోవడానికి ప్రయత్నించిన ఆమె మనస్సాక్షిని అభినందిస్తున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఉద్యోగులకు సీఈవో వింత గిఫ్ట్! ఒక్కొక్కరికీ రూ. 2.6 లక్షల పరుపు

Loading...
Unable to load recommendations.
Follow Us