ఒక్క రోజులో రూ.73 లక్షల షాపింగ్ చేసిన భార్య !!
దుబాయ్‌కి చెందిన సౌదీయా అనే మహిళ అదే దేశానికి చెందిన జమాల్ అనే వ్యక్తిని వివాహమాడింది. జమాల్ చాలా రిచ్ పర్సన్. దీంతో సౌదీయాకు ఎలాంటి లోటు లేకపోయింది. వివాహం అనంతరం ఆమె ఏం కావాలన్నా దొరుకుతోంది. ఇక దానికి సంబంధించిన లగ్జరీయస్ లైఫ్‌ను ఆమె నెటిజన్లతో పంచుకుంది.
దుబాయ్‌కి చెందిన సౌదీయా అనే మహిళ అదే దేశానికి చెందిన జమాల్ అనే వ్యక్తిని వివాహమాడింది. జమాల్ చాలా రిచ్ పర్సన్. దీంతో సౌదీయాకు ఎలాంటి లోటు లేకపోయింది. వివాహం అనంతరం ఆమె ఏం కావాలన్నా దొరుకుతోంది. ఇక దానికి సంబంధించిన లగ్జరీయస్ లైఫ్‌ను ఆమె నెటిజన్లతో పంచుకుంది. వీరిద్దరి పరిచయం తొలిసారి దుబాయ్ యూనివర్సిటీలో జరగ్గా.. ఆ తర్వాత అది కాస్త ప్రేమగా మారింది. ఇద్దరూ వైవాహిక బంధంతో ఒక్కటై రెండేళ్లయింది. నా భర్త మూడ్ బట్టి రోజుకు రూ.3.66 లక్షల నుంచి రూ.73 లక్షల వరకు షాపింగ్ చేస్తుంటాం అంటూ సౌదియా పోస్ట్‌లో రాసుకొచ్చింది. మా ఇద్దరికీ ఫేవరెట్ స్పాట్ మాల్దీవులు. ఇక లండన్‌కి అయితే తరచూ వెళ్తుంటాం. మొన్నే షీషెల్స్ ట్రిప్ నుంచి తిరిగి వచ్చాం. నెక్స్ట్ టూర్ జపాన్. నా హబ్బీ అయితే నాకు రోజు కాస్ట్లీ గిఫ్ట్ తెస్తాడు. ఇటీవలే రెండు ఖరీదైన కార్లు కొనిచ్చాడు. ఒకవేళ బయట రెస్టారెంట్‌కు వెళ్తే.. రూ.1.10 లక్షలు ఖర్చు అవుతాయి’ అని సౌదీయా తన లైఫ్ స్టయిల్ గురించి చెప్పుకొచ్చింది. ఇక చివరిగా ‘ఐ యామ్ రిచ్ దుబాయ్ హౌజ్ వైఫ్, భర్త సంపాదన ఖర్చుపెట్టడమే నా హాబీ’ అని రాసుకొచ్చింది. కాగా, దీనిపై నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్స్‌తో హోరెత్తిస్తున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
మాయం కానున్న నక్షత్రాలు.. ఇప్పుడే తనివితీరా చూసేయండి
కుక్కల కోసం స్పెషల్ ఊయల.. కిర్రాక్ ఐడియా..
ఈ రాయిని మండించండి.. వైఫై సిగ్నల్ తన్నుకుంటూ వస్తుంది
30 లక్షలమందిని ఇంప్రెస్ చేసిన దోశ.. తింటే వదలరు
యవ్వనం కోసం కోట్లు ఖర్చుచేయక్కర్లేదు.. కేవలం ఈ గదిలోకి వెళ్తే చాలు