కదులుతున్న బస్సులో నుంచి పడిపోయిన మహిళ.. ఆ తర్వాత వీడియో

Updated on: Aug 16, 2025 | 8:38 PM

బస్సు ఎక్కేటప్పుడు ప్రయాణికులు జాగ్రత్తగా ఎక్కాలి. అలాగే బస్సులోని డ్రైవర్‌, కండక్టర్‌ కూడా ప్రయాణికులు సేఫ్‌గా బస్సు ఎక్కారా లేదా చూసుకొని బస్సు స్టార్ట్‌ చేయాలి. లేదంటే అనుకోని ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. అలాంటి ఘటనే ఒకటి కేరళలో జరిగింది. బస్సు ఎక్కిన మహిళ సీటులో కూర్చునేందుకు వెళ్తుండగా ఒక్కసారిగా బస్సు కదలడంతో పట్టుతప్పి కిందపడిపోయింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది.

కేరళలోని త్రిసూర్‌లో ఓ వృద్ధురాలు బస్సు ఎక్కింది. ఇంతలో కండక్టర్‌ ఆమెవైపు వచ్చి సీటు ఖాళీగా ఉందని అక్కడకు వెళ్లి కూర్చోమని చెప్పడంతో సీటు దగ్గరకు వెళ్తుండగా కుదుపులకు అదుపుతప్పి బస్సు డోర్‌లో నుంచి ఒక్కసారిగా బయటకు పడిపోయింది. ఈ ప్రమాదంలో సదరు మహిళ ప్రాణాలు అక్కడికక్కడే కోల్పోయింది. రెప్పపాటులో జరిగిన ఈ ఘటనతో బస్సులోని వారంతా షాక్‌కు గురయ్యారు. మహిళ బస్సులో నుంచి బయటకు పడే సమయంలో కండక్టర్‌ ఆమెను పట్టుకునేందుకు ముందుకు పరిగెత్తాడు. కానీ అప్పటికే ఆలస్యమైపోయింది. కండక్టర్‌ వెంటనే బస్సును ఆపి బాధిత మహిళను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అక్కడ పరీక్షించిన వైద్యులు ఆమె అప్పటికే మృతి చెందినట్లు నిర్ధరించారు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి.

మరిన్ని వీడియోల కోసం :

ఐశ్వర్యారాయ్‌ 17 ఏళ్లుగా రాఖీ కడుతున్న ఆ స్టార్‌ యాక్టర్‌ ఎవరో తెలుసా?

కాసేపట్లో పెళ్లి.. మొదటి భార్యతో వరుడు జంప్ వీడియో

సింహానికి ఎదురెళ్లిన మనిషి.. చివరికి.. వీడియో

ఆ సమయంలో మహిళలకు ఎందుకు ఎక్కువగా జుట్టు రాలిపోతుందో తెలుసా?