వరంగల్‌లో ప్లాస్టిక్ పార్క్.. చెత్తతో అద్భుతాలు!
వరంగల్ నగరపాలక సంస్థ ప్లాస్టిక్ వ్యర్థాలతో అర ఎకరంలో "వేస్ట్ టూ బెస్ట్" పార్కును ఏర్పాటు చేసింది. చెత్తకుప్పల నుంచి సేకరించిన బాటిల్స్, టైర్లు, పైపులు, కవర్లు వంటి వ్యర్థాలతో 128కు పైగా కళాకృతులు రూపొందించారు. పర్యావరణ పరిరక్షణ, ప్లాస్టిక్ పునర్వినియోగంపై ప్రజల్లో అవగాహన పెంచే ఈ వినూత్న పార్క్ సందర్శకులను విశేషంగా ఆకట్టుకుంటోంది.
చైతన్యం, సృజనాత్మకత తోడైతే చెత్తతోనూ అద్భుతాలు సృష్టించవచ్చని నిరూపిస్తోంది వరంగల్ నగరపాలక సంస్థ. పర్యావరణ పరిరక్షణ, ప్లాస్టిక్ పునర్వినియోగంపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ప్రధాన కార్యాలయం ముందు అర ఎకరం స్థలంలో వినూత్నంగా “వేస్ట్ టూ బెస్ట్” ప్లాస్టిక్ పార్కును నిర్మించారు. జీడబ్ల్యూఎంసీ మెడికల్ అండ్ హెల్త్ టీమ్, హార్టికల్చర్ డిపార్ట్మెంట్ సిబ్బంది సంయుక్తంగా ఈ వినూత్న ప్రయత్నానికి శ్రీకారం చుట్టారు. శానిటేషన్ సిబ్బంది చెత్తకుప్పల నుండి సేకరించిన ప్లాస్టిక్ వ్యర్థాలతో ఇక్కడ సుమారు 128 రకాల మనోహరమైన కళాకృతులను రూపుదిద్దారు. నిరుపయోగంగా పారేసిన 2 వేలకు పైగా వాటర్ బాటిల్స్, ప్లాస్టిక్ పైపులు, కవర్లు, క్యాన్లు, టైర్లు, డ్యామేజ్ కుర్చీలు, సఫాయి వెహికల్ బ్రష్‌లు వంటి వ్యర్థాలను ఈ పార్కు నిర్మాణంలో ఉపయోగించారు. ఈ పార్కులో ప్లాస్టిక్ వ్యర్థాలతో రూపొందించిన జంతువులు, పక్షుల నమూనాలు, పూల తోరణాలు, టైర్లతో చేసిన చేద బావులు, వాటర్ బాటిల్స్‌తో తయారు చేసిన గుర్రపు రథం ఇంకా…పారిశుద్ధ్య కార్మికుల నమూనాలు సందర్శకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. చెత్తను సరైన చోట వేస్తే శుభ్రత.. సృజనాత్మకతతో వాడితే సంపద పెరుగుతుంది అనే నినాదంతో ఏర్పాటు చేసిన ఈ పార్క్, నగరానికి వచ్చే సందర్శకులను ఆకట్టుకోవడమే కాకుండా, పాఠశాల విద్యార్థులకు పర్యావరణ పరిరక్షణపై ఒక చక్కటి సందేశాన్ని అందిస్తోంది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
అద్భుతం.. పెంకులేని గుడ్డునుంచి కోడిపిల్ల పుట్టింది!
శ్రీవారి వైభోగం..! జూన్‌లో రూ.128.29 కోట్ల ఆదాయం.. వేసవిలో ఆల్‌టైమ్ రికార్డ్!
Papikondalu: ఆంధ్రప్రదేశ్ కాశ్మీర్.. పాపికొండల టూర్‌కు గ్రీన్ సిగ్నల్ ఈ యాత్ర ఎందుకంత స్పెషల్?
E20 పెట్రోల్‌తో ఇంజిన్ పాడవుతుందా? 10 పాయింట్లతో కేంద్రం క్లారిటీ!
