Volvo XC40: వోల్వో XC40 రీచార్జ్‌ కార్లు.. రెండు గంటల్లో హాట్‌కేకుల్లా.. ఒకసారి చార్జింగ్‌తో ఎంతదూరం అంటే..

Updated on: Aug 08, 2022 | 10:04 PM

లగ్జరీ కార్ల తయారీలో ఉన్న వోల్వో కార్‌ ఇండియా తాజాగా ప్యూర్‌ ఎలక్ట్రిక్‌ ఎస్‌యూవీ ఎక్స్‌సీ40 రీచార్జ్‌ను ప్రవేశపెట్టింది. ధర ఎక్స్‌షోరూంలో 55.9 లక్షలు. ఆన్‌లైన్‌లో బుకింగ్స్‌ రెండు గంటల్లో క్లోజ్‌ కావడం విశేషం.


లగ్జరీ కార్ల తయారీలో ఉన్న వోల్వో కార్‌ ఇండియా తాజాగా ప్యూర్‌ ఎలక్ట్రిక్‌ ఎస్‌యూవీ ఎక్స్‌సీ40 రీచార్జ్‌ను ప్రవేశపెట్టింది. ధర ఎక్స్‌షోరూంలో 55.9 లక్షలు. ఆన్‌లైన్‌లో బుకింగ్స్‌ రెండు గంటల్లో క్లోజ్‌ కావడం విశేషం. 50,000 రూపాయలు చెల్లించి బుకింగ్‌ చేసుకున్నారు వినియోగదారులు. రెండు గంటల్లోనే 150 కార్లు అమ్ముడుపోయాయి. భారత్‌లో అసెంబుల్‌ అయిన తొలి లగ్జరీ ఎలక్ట్రిక్‌ కారు ఇదేనని కంపెనీ ప్రకటించింది. ఒకసారి చార్జింగ్‌ చేస్తే 400 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది.78 కిలోవాట్‌ అవర్‌ సామర్థ్యం గల 500 కిలోల లిథియం అయాన్‌ బ్యాటరీ ఏర్పాటు చేశారు. బ్యాటరీపై ఎనమిదేళ్ల వారంటీ ఉంది. టాప్‌ స్పీడ్‌ గంటకు 180 కిలోమీటర్లు. 4.9 సెకన్లలోనే గంటకు 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. 6 ఎయిర్‌బ్యాగ్స్, ఆల్‌ వీల్‌ డ్రైవ్, హార్మన్‌ కార్డన్‌ ప్రీమియం సౌండ్‌ సిస్టమ్, క్రాస్‌ ట్రాఫిక్‌ అలర్ట్‌తో బ్లైండ్‌ స్పాట్‌ ఇన్ఫర్మేషన్‌ సిస్టమ్, అడాప్టివ్‌ క్రూజ్‌ కంట్రోల్, పైలట్‌ అసిస్ట్, కొలీషన్‌ మిటిగేషన్‌ సపోర్ట్‌ వంటి హంగులు ఉన్నాయి. డెలివరీలు అక్టోబర్‌ నుంచి మొదలవుతాయి.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Python-cat: పిల్లిపై కొండచిలువ ఎటాక్‌.. సూపర్‌ షాకిచ్చిన పిల్లి.. వైరల్ అవుతున్న సూపర్ వీడియో..

Cats fight: నడిరోడ్డుపై పిల్లుల ముష్టి యుద్ధం.. మధ్యలో దూరిన కాకి ఏం చేసిందో చూస్తే నవ్వులే..

Published on: Aug 08, 2022 10:04 PM
Loading...
Unable to load recommendations.
Follow Us