100 అడుగుల నోట్ల దండ.. నిచ్చెన ఎక్కి మరీ.. మెడలో వేసుకున్న వరుడు
రాజస్థాన్‌లోని డీగ్ జిల్లాలో జరిగిన ఓ పెళ్లి ఇప్పుడు సోషల్ మీడియాలో సంచలనం సృష్టించింది. 100 అడుగుల పొడవైన కరెన్సీ నోట్ల దండను వరుడు మెడలో ధరించి ఊరేగింపులో పాల్గొన్నాడు. స్థానికులు దీనిని తమ ఆచారంగా చెప్పినా, పోలీసుల విచారణలో ప్రదర్శన కోసం అద్దెకు తెచ్చినట్లు తేలింది. పెళ్లిలో దృష్టిని ఆకర్షించే ఈ కొత్త ట్రెండ్ వీడియో వైరల్ అవుతోంది.
పెళ్లి అంటేనే రకరకాల ఆచారాలు సంప్రదాయాలు ఉంటాయి. ఒక్కో ప్రాంతాన్ని బట్టి ఆచారవ్యవహారాలు పాటిస్తారు. రాజస్థాన్‌లోని డీగ్ జిల్లాలో జరిగిన ఒక వివాహం ఇప్పుడు సోషల్ మీడియాలో సెన్సేషన్‌గా మారింది. బమన్వాడీ గ్రామంలో ఏప్రిల్ 19న ఓ వివాహం జరిగింది. సాధారణంగా పెళ్లిలో పూలదండో, కర్పూర దండో వధూవరుల మెడలో వరమాలగా వేస్తారు. కానీ ఈ పెళ్లి వేడుకలో వరుడికి నోట్లతో తయారుచేసిన మాలను వేశారు కుటుంబ సభ్యులు. ఎందుకలా..అంటే.. అది వారి ఆచారమట. అదికూడా మూరో..రెండుమూరల దండో కాదు.. ఏకంగా 100 అడుగుల పొడవైన కరెన్సీ నోట్ల దండ! ఆ దండ మెడలో వేసుకోడానికి వరుడు నిచ్చెన ఎక్కాల్సి వచ్చిందని మీకు తెలుసా? పైగా ఈ నోట్ల దండను అద్దెకు తెచ్చారట. ఈ దండను రూ.500, రూ.100 నోట్లతో తయారు చేసారు. పెళ్లి ఊరేగింపులో భాగంగా రోడ్డుమీద భారీ కరెన్సీ నోట్ల దండను ధరించి వెళ్తున్న వరుణ్ని కళ్లప్పగించి చూస్తుండిపోయారు స్థానికులు. పెళ్లిళ్లలో ఇలా నోట్ల దండలు వేయడం తమ ఆచారమని స్థానికులు చెబుతున్నారు. అయితే, ఈ భారీ దండపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరగడంతో ఈ ఘటనపై అధికారులు దృష్టి సారించారు. దీనిపై జిల్లా ఎస్పీ విచారణ జరిపి అసలు విషయాన్ని బయటపెట్టారు. ప్రదర్శన కోసం ధరించిన ఆ భారీ కరెన్సీ నోట్ల దండను వరుడి కుటుంబ సభ్యులు అద్దెకు తీసుకున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. ఏది ఏమైనా, పెళ్లిలో అందరి దృష్టిని ఆకర్షించేందుకు చేసిన ఈ కొత్త ట్రెండ్ వీడియో ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతోంది. విందులు, వినోదాల కోసం ఇప్పుడు నోట్ల దండలను కూడా అద్దెకు ఇవ్వడం వింతగా ఉందని నెటిజన్లు సరదాగా కామెంట్ చేస్తున్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
అమ్మ ప్రేమకు భాష లేదు.. కదిలించిన దృశ్యం !!
ముంచుకొస్తున్న సూపర్ ఎల్ నినో.. మానవాళికి డెత్ వారెంట్.. !
పార్క్‌లో వాకింగ్ చేస్తున్నారా.. పన్ను కట్టాల్సిందేనా? అసలేం జరిగింది?
తెలుగు రాష్ట్రాల్లో పెట్రో కష్టాలు.. రంగంలోకి దిగిన అధికారులు
122 ఏళ్ల తర్వాత వెలుగులోకి ఒళ్లు గగుర్పొడిచే నిజం! గర్భగుడిలో 1000 ఏళ్ల నాటి రహస్యం