పైకి కటిక పేదవాడు.. ఇంటి లోపలికి వెళ్తే కళ్లు తిరుగుతాయ్ వీడియో
సాధారణంగా బ్రతుకుతెరువు కోసం పొట్టచేతపట్టుకొని ఇతర ప్రాంతాల నుంచి వలస వచ్చినవారు గుడిసెలు వేసుకొని కనీస సౌకర్యాలు కూడా లేకుండా బ్రతుకుతారు. ఇలాంటివారికి రెక్కాడితేకానీ డొక్కాడదు. ఆరోజు కడుపునిండితే చాలని వారు భావిస్తారు. ఇంట్లో టీవీ, ఫ్రిజ్, ఏసీ అనేవి ఉండాలని ఆశ ఉన్నా.. వారు తమ సంపాదన దృష్ట్యా వాటి గురించి ఆలోచించరు. కానీ ఓ వ్యక్తి పూరిగుడిసెలో సాగిస్తున్న జీవనాన్ని చూసి ఆశ్చర్యపోతారు.
వైరల్ అవుతున్న ఈ వీడియో ప్రకారం.. రోడ్డు పక్కన చెట్ల మధ్యలో ఓ చిన్న పూరిల్లు ఉంది. ఆ గుడిసెలాంటి ఇంటిముందు ఏసీ అవుట్ డోర్ యూనిట్ ఉంది. దానిపైన కొన్ని వంటపాత్రలు కూడా ఉన్నాయి. ఏదో పాడయిపోయిన ఏసీకి సంబంధించినది ఇలా వాడుకుని ఉంటారులే అనుకుంటే పొరపాటే.. ఆ గుడిసె లోపలికి వెళ్లి చూస్తే లోపల ఏసీ బిగించి ఉంది. అలాగే మినీ ఫ్రిడ్జ్ కూడా ఉంది. ఓ వ్యక్తి డబుల్ కాట్ బెడ్ మీద హాయిగా పడుకుని, స్నాక్స్ తింటూ ఎల్‌ఈడీ టీవీ చూస్తూ ఎంజాయ్ చేస్తున్నాడు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియో చూస్తున్న నెటిజన్లు నోరెళ్లబెడుతున్నారు. ఈ వీడియోను ఇప్పటివరకు దాదాపు 50 లక్షల మందికి పైగా వీక్షించారు. నాలుగున్నర లక్షల మందికి పైగా లైక్ చేశారు. ఆ వీడియోపై నెటిజన్లు తమదైన శైలిలో ఫన్నీ కామెంట్లు చేశారు. ఇది వీఐపీ టెంట్ అని ఒకరు … నేను కూడా ఇలాంటి పేద బతుకును కోరుకుంటున్నా అని మరొకరు … ఈ ప్రపంచంలో పేదరికం మొత్తం ఇంత అందంగా మారిపోతే ఎంత బాగుంటుంది అని ఇంకొకరు కామంట్ చేశారు.
మరిన్ని వీడియోల కోసం :
పుడమి తల్లికి రుతుచక్రం..కామాఖ్య తలుపులు ఆ 5 రోజులు మూసివేత వీడియో
కరెంట్ పోల్ పైన పక్షి గూళ్లు .. ఆఫ్రికాలో అద్భుతం వీడియో
బ్యాచ్ లర్స్.. ఇది మీ కోసమే వీడియో
ఆటోడ్రైవర్‌తో మహిళల ఫైట్.. నడిరోడ్డుపై జుట్టుపట్టి వీరంగం
పొలానికి వెళ్లిన రైతు.. దూరంగా కనిపించినది చూసి హడలిపోయి..
విషపూరిత పాములను చంపేందుకు తెచ్చిన ముంగీసల కథ..
ఇక ఇంటర్నెట్ లేకపోయినా ఫోన్లోనే లైవ్ టీవీ చూడొచ్చు!
ఏనుగునైనా చంపే కింగ్ కోబ్రా.. తన పిల్లల కోసం ఏం చేసిందో తెలుసా
మొక్కలకు నీళ్లు పోస్తున్న వ్యక్తి.. వెనుక ఏదో అలికిడి.. చూడగా
సినిమాకి వెళ్తే 22 నిమిషాలు యాడ్స్ వేస్తారా..?

