
Cristiano Ronaldo – Coca Cola: స్టార్ ఫుట్‌బాల్ క్రీడాకారుడు క్రిస్టియానో రొనాల్డో ఈ వారమంతా ట్రెండింగ్‌లో ఉంటుంన్నాడు. ఓ మ్యాచ్ కు ముందు నిర్వహించిన సమావేశంలో మాట్లాడే ముందు.. కోకాకోలా బాటిళ్లను పక్కన పెట్టాడు. దీంతో ఈ స్టార్ ఆటగాడిపై సోషల్ మీడియాలో మీమ్స్ ఫెస్ట్‌కు దారి తీసింది. రోజుకో రకంగా ఈ వీడియోను రీ క్రియోట్ చేస్తూ.. నవ్వులుపూయిస్తున్నారు కొందరు. తాజాగా ఓ టిక్ టాక్ యూజర్ ఒకరు.. ఈ ఎపిసోడ్‌ను అద్బుతంగా ఎడిటింగ్ చేసి, నెట్టింట్లోకి వదిలాడు. ఇంకేముంది మనోడి ఎడిటింగ్‌కు నెటిజన్లు ఫిదా అయ్యారు. అద్భుతంగా నటించావని కొందరు, సూపర్ ఎడిటింగ్ బ్రో అంటూ కామెంట్లు, షేర్లు చేస్తూ తెగ సందడి చేస్తూ వైరల్ గా మార్చారు. ట్విట్టర్ యూజర్ బీ అభిషేక్గురేజా.. టిక్‌టాక్ యూజర్ క్రియోట్ చేసిన ఈ వీడియోను పోస్ట్ చేశాడు.
రొనాల్డో ఏం చేశాడంటే.. యూరో కప్‌లో పోర్చుగల్, హంగేరి ల మధ్య ఓ మ్యాచ్ జరగనుంది. ఈమేరకు మ్యాచ్‌కు ముందు విలేకరుల సమావేశంలో రొనాల్డో.. తన ముందు ఉంచిన రెండు కోక్ బాటిళ్లను గుర్తించాడు. వెంటనే ఆ బాటిళ్లను అక్కడి నుంచి తీసేశాడు. వాటికి బదులు మీడియాకు ఓ వాటర్ బాటిల్ చూపిస్తూ గట్టిగా వాటర్ అంటూ అరిచాడు. అప్పటి నుంచి ఈ వీడియో సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో ఉంటూనే ఉంది. మరోవైపు డబ్ల్యూటీసీ ఫైనల్ మ్యాచ్ కు ముందు విరాట్ కోహ్లీపై కూడా ఈ వీడియోను వాడేశారు నెటిజన్లు. ఇలా రోజుకో రకంగా రొనాల్డో ఎపిసోడ్ ట్రెండింగ్ అవుతూనే ఉంది.
ఈ ఫన్నీ వీడియోలో ఏముందంటే.. టిక్‌టాక్ యూజర్ స్మార్ట్ టీవీ తెరపై రోనాల్డో తో మాట్లాడుతున్నట్లు వీడియో క్రియోట్ చేశాడు. అనంతరం రోనాల్డో కు కోకాకోలా బాటిళ్లను ఇవ్వాలని సైగ చేశాడు. దీంతో రోనాల్డో ఆ బాటిళ్లను పక్కకు నెట్టాడు.. ఈ టిక్‌టాక్ యూజర్ టెలివిజన్ వెనుక నుంచి ఆ రెండు బాటిళ్లను బయటకు తీసి అలా నడుచుకుంటూ వెళ్లాడు. ఆ బాటిళ్లను తనకోసమే పక్కకు పెట్టినట్లుగా ఈ వీడియోను క్రియోట్ చేశాడు ఆ యూజర్.
మరోవైపు రొనాల్డో చర్య తర్వాత కోకాకోలా మార్కెట్ విలువ 4 బిలియన్ డాలర్ల మేర తగ్గింపోయింది. ఈ సంఘటన తర్వాత కోకాకోలా ఒక ప్రకటనలో “ప్రతి ఒక్కరూ తమ డ్రింక్‌ను ఎంచుకునే అర్హత ఉందంటూ పేర్కొంది. ప్రతి ఒక్కరికి భిన్నమైన అభిరుచులు, అలాగే అవసరాలు ఉంటాయని ” రాసుకొచ్చింది.
Also Read:
Viral Videos: సో క్యూట్.. పక్షులతో ఆడుకుంటున్న బుల్లి ఏనుగు భలే.. భలే..!