ఎందుకంత తొందర.. కాస్త ఆలస్యమైతే ప్రాణాలే పోయేవిగా

Updated on: Sep 07, 2022 | 8:48 PM

రైలు పట్టాలు దాటే సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. కొందరు రైల్వే గేట్లు మూసి ఉన్నా మూర్ఖంగా ప్రవర్తిస్తుంటారు. గేట్లను దాటడం, పై నుంచి దూకడం వంటి ప్రమాదకర చర్యలకు పాల్పడుతుంటారు.

రైలు పట్టాలు దాటే సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. కొందరు రైల్వే గేట్లు మూసి ఉన్నా మూర్ఖంగా ప్రవర్తిస్తుంటారు. గేట్లను దాటడం, పై నుంచి దూకడం వంటి ప్రమాదకర చర్యలకు పాల్పడుతుంటారు. కొన్ని సార్లు ప్రాణాలు కూడా కోల్పోతుంటారు. అందుకే రైల్వే గేట్లు వద్ద, పట్టాలు దాటే సమయంలో అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వాలు అవగాహన కలిగిస్తుంటాయి. అయినా కొందరిలో మార్పు రావడం లేదు. మూర్ఖంగా వ్యవహరిస్తూ ప్రాణాలు కోల్పోతుంటారు. ప్రస్తుతం అలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియోలో రైలు పట్టాలు దాటేందుకు రైల్వే గేట్ లేదు. కానీ ఒక వ్యక్తి మాత్రం తన కారుతో పట్టాలు దాటేందుకు ప్రయత్నించాడు. అయితే అనుకోకుండా కారు ఇరుక్కుపోతుంది. కారు డ్రైవర్ ఎలాగైనా కారును అక్కడి నుంచి బయటకు తీసుకురావాలని తీవ్రంగా ప్రయత్నించాడు. సాధ్యం కాలేదు. ఇంతలో వేగంగా రైలు దూసుకువస్తుంది.. అతను వెంటనే అప్రమత్తమై కారు నుంచి దిగి వెళ్లిపోయాడు. వేగంగా దూసుకొచ్చిన రైలు క్షణాల్లో కారును ముక్కలుముక్కలుగా చేసేసింది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఇంటికి దిష్టి తీసి గుమ్మడికాయను నేలపై కొట్టాడు.. ఊహించని సీన్ కు భయంతో పరుగులు

వీడు మామూలోడు కదా.. ఏకంగా విమానాన్నే దొంగిలించాడు..

ఇదేం రివెంజ్‌రా సామీ !! అమ్మాయి నో చెప్తే ఇలా చేస్తారా !!

Viral:ప్రకృతి వైచిత్రి !! అల్పజీవి సాలె పురుగు చేతిలో కాలనాగు బలి !!

ఇదెక్కడి పిచ్చి బాబు !! పళ్లు క్లీన్‌ చేయడానికి రూ.4 లక్షలా.. ద్యావుడా

 

Published on: Sep 07, 2022 08:48 PM
Loading...
Unable to load recommendations.
Follow Us