Viral Video: ఓల్డ్‌ స్టూడెంట్స్‌.. 75 ఏళ్ల వయసులోనూ హుషారెత్తే స్టెప్పులు..

Updated on: Mar 10, 2023 | 9:18 AM

జీవితంలో ఎంత ఎదిగినా కాలేజ్ లైఫ్ గుర్తుకురాగానే ఎవ‌రికైనా అంతులేని ఉత్సాహం క‌ట్టలు తెంచుకుంటుంది. ఆడిపాడే వ‌య‌సులో చేసిన అల్ల‌ర్లు తీపి జ్ఞాప‌కాలుగా కళ్లముందు కదలాడుతాయి.

జీవితంలో ఎంత ఎదిగినా కాలేజ్ లైఫ్ గుర్తుకురాగానే ఎవ‌రికైనా అంతులేని ఉత్సాహం క‌ట్టలు తెంచుకుంటుంది. ఆడిపాడే వ‌య‌సులో చేసిన అల్ల‌ర్లు తీపి జ్ఞాప‌కాలుగా కళ్లముందు కదలాడుతాయి. ఇక కేర‌ళ‌లోని కాలిక‌ట్ మెడిక‌ల్ కాలేజ్‌లో 1966 బ్యాచ్ స్టూడెంట్స్ రీయూనియ‌న్ ఫంక్షన్‌లో మ‌ళ‌యాళం సాంగ్‌ ప‌లా ప‌ల్లికి డ్యాన్స్ చేసిన వీడియో నెటిజ‌న్లను ఆక‌ట్టుకుంటోంది. ఈ వీడియోను డాక్టర్ రాయ్ క‌ల్లివ‌యాలిల్ ట్విట్టర్‌లో షేర్ చేశారు. ఇందులో 2022లో విడుద‌లైన క‌దువ మూవీ నుంచి హుషారైన సాంగ్‌కు మెడిక‌ల్ కాలేజ్ ఓల్డ్‌ స్టూడెంట్స్‌ డ్యాన్స్ చేయ‌డం క‌నిపిస్తుంది. 75 ఏళ్లు పైబ‌డిన ఆ మ‌హిళ‌లంద‌రూ శారీల్లో మెరుస్తూ గ్రేస్‌తో డ్యాన్స్ చేసిన తీరు నెటిజ‌న్లను ఆక‌ట్టుకుంది. సో కూల్‌..! కాలిక‌ట్ మెడిక‌ల్ కాలేజ్ 1966 బ్యాచ్‌ రీయూనియ‌న్‌..అంద‌రూ 75ఏండ్లు పైబ‌డిన వారే..జీవితాన్ని వేడుక‌గా ఆస్వాదిస్తున్నార‌ని పోస్ట్‌కు క్యాప్ష‌న్ ఇచ్చారు. ఈ వీడియో ప్రస్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. ఈ వీడియో సో కూల్ అంటూ ఓ యూజ‌ర్ కామెంట్ చేయ‌గా, అద్భుత‌మ‌ని మ‌రో యూజ‌ర్ ప్రశంస‌లు కురిపించారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Ranbir Kapoor: సెలబ్రిటీ లైఫ్ ఈజీ కాదంటున్న రణబీర్.. ఏమైయింది అంటే..? వీడియో

Allu Arjun – Shah Rukh Khan: షారుఖ్‌కు దిమ్మతిరిగే పంచ్‌ ఇచ్చిన బన్నీ.. వీడియో.

Allu Arjun: అర్జున్ రెడ్డి 2.O.. వచ్చేస్తున్నాడు పాన్ ఇండియా మూవీ.. కాస్కోండి మరి..!

Published on: Mar 10, 2023 09:18 AM
Loading...
Unable to load recommendations.
Follow Us