ఉపాధ్యాయుడి వింత చేష్టలు.. విద్యార్ధి తలపై ఏం చేశాడో చూడండి!

Updated on: Oct 14, 2026 | 9:09 PM

ఉత్తరప్రదేశ్‌లోని ఇటావా జిల్లాలో ఓ ఉపాధ్యాయుడి ప్రవర్తన తీవ్ర వివాదానికి దారితీసింది. బిరౌలి ప్రాథమిక పాఠశాలలో అసిస్టెంట్‌ టీచర్‌ దినేశ్‌ కుమార్‌ మాథుర్‌ గుండుతో ఉన్న చిన్నారి తలపై తబలా వాయిస్తున్నట్లు నటిస్తూ నవ్విన వీడియో వైరల్‌గా మారింది. దీనిపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేయడంతో విద్యాశాఖ స్పందించింది. విద్యార్థి పట్ల అనుచితంగా ప్రవర్తించినందుకు ఉపాధ్యాయుడిని సస్పెండ్‌ చేస్తూ జిల్లా అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు.

ఉపాధ్యాయ వృత్తికి మచ్చ తెచ్చేలా ఒక ఉపాధ్యాయుడు చేసిన చేష్టలు తీవ్ర దుమారాన్ని రేపాయి. ఉత్తరప్రదేశ్‌లోని ఇటావా జిల్లా సైఫాయ్ బ్లాక్ పరిధిలోని బిరౌలి ప్రాథమిక పాఠశాలలో దినేశ్ కుమార్ మాథుర్ అసిస్టెంట్ టీచర్‌గా పనిచేస్తున్నారు. తరగతి గదిలో విద్యార్థులంతా నేలపై కూర్చున్నారు. ఆ ఉపాధ్యాయుడు కుర్చీలో కూర్చున్నాడు. ఆయన ఎదురుగా కూర్చున్న ఓ చిన్నారి గుండుతో ఉన్నాడు. వెంటనే ఉపాధ్యాయుడు ఆ చిన్నారిని పిలిచి తలపై తన చేతులతో తబలా వాయిస్తున్నట్లుగా నటిస్తూ పెద్దగా నవ్వుతూ కనిపించాడు. ఈ చేష్టలకు సంబంధించిన వీడియోను ఆయనే స్వయంగా తన ఫేస్‌బుక్ ఖాతాలో అప్‌లోడ్ చేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ కావడంతో నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థులను ప్రేమతో చూసుకోవాల్సిన ఉపాధ్యాయుడే ఇలా ప్రవర్తించడం సరికాదని, ఇది ఆ చిన్నారి ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా ఉందని మండిపడ్డారు. ఇతరుల ముందు ఇలా చేయడం వల్ల పిల్లల్లో అభద్రతా భావం, అవమానభారం కలుగుతాయని పలువురు అభిప్రాయపడ్డారు. ‘ఇందులో నవ్వుకోవాల్సింది ఏమీ లేదని’ నెటిజన్లు విమర్శలు గుప్పించారు. ఈ ఘటనపై విద్యాశాఖకు పెద్ద ఎత్తున ఫిర్యాదులు వెళ్లాయి. విషయాన్ని తీవ్రంగా పరిగణించిన జిల్లా బేసిక్ శిక్షా అధికారి తక్షణమే స్పందించారు. విద్యార్థి పట్ల అనుచితంగా ప్రవర్తించిన అసిస్టెంట్ టీచర్ దినేశ్ కుమార్ మాథుర్‌ను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. సరదా పేరుతో చేసే ఇలాంటి పనులు చిన్నారుల మానసిక స్థితిపై తీవ్ర ప్రభావం చూపుతాయని, ఉపాధ్యాయులు మరింత బాధ్యతాయుతంగా ప్రవర్తించాలని సూచించారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

హైదరాబాద్ నుంచి 3 బుల్లెట్ ట్రైన్లు! మూడు నగరాలకు హైస్పీడ్ జర్నీ!

డిగ్రీ అర్హతతో రైల్వేలో 3,548 ఉద్యోగాలు.. RRB NTPC నోటిఫికేషన్ విడుదల!

లక్షలాదిమంది మనసు గెలిచిన అమ్మ.. బిడ్డను వీపుపై మోస్తూ..

Loading...
Unable to load recommendations.
Follow Us