చేయని నేరానికి పదేళ్ళ జైలు శిక్ష.. రూ.వందల కోట్లలో పరిహారం ఇప్పించిన కోర్టు.

Updated on: Sep 14, 2024 | 1:50 PM

నేరం చేయకపోయినా పదేళ్ల పాటు జైలు శిక్ష అనుభవించాడో ఓ వ్యక్తి. చివరకు అతడు ఏ తప్పూ చేయలేదని తేలడంతో కోర్టు విడుదల చేసింది. అయితే, ఇన్నేళ్ల పాటు అన్యాయంగా ఆయన జీవితం జైలు గోడలకు పరిమితమైనందుకు గానూ ఏకంగా 50 మిలియన్‌ డాలర్ల నష్టపరిహారం చెల్లించాలని న్యాయస్థానం తాజాగా ఆదేశించింది. అమెరికా లోని చికాగో ఫెడరల్‌ జ్యూరీ కోర్టు ఈ సంచలన తీర్పు వెలువరించింది.

నేరం చేయకపోయినా పదేళ్ల పాటు జైలు శిక్ష అనుభవించాడో ఓ వ్యక్తి. చివరకు అతడు ఏ తప్పూ చేయలేదని తేలడంతో కోర్టు విడుదల చేసింది. అయితే, ఇన్నేళ్ల పాటు అన్యాయంగా ఆయన జీవితం జైలు గోడలకు పరిమితమైనందుకు గానూ ఏకంగా 50 మిలియన్‌ డాలర్ల నష్టపరిహారం చెల్లించాలని న్యాయస్థానం తాజాగా ఆదేశించింది. అమెరికా లోని చికాగో ఫెడరల్‌ జ్యూరీ కోర్టు ఈ సంచలన తీర్పు వెలువరించింది. 19ఏళ్ల వ్యక్తిని హత్య చేశాడన్న అభియోగాలపై మార్సెల్‌ బ్రౌన్‌ అనే వ్యక్తిని 2008లో పోలీసులు అరెస్టు చేశారు. దీనిపై అప్పట్లో విచారణ జరిపిన న్యాయస్థానం అతడిని దోషిగా నిర్ధారిస్తూ 35 ఏళ్ల జైలు శిక్ష విధించింది. అయితే, అతడితో బలవంతంగా నేరం ఒప్పుకునేలా చేశారని చెబుతూ 2018లో బ్రౌన్‌ తరఫున న్యాయవాదులు కోర్టుకు సాక్ష్యాధారాలు సమర్పించారు. దీంతో అతడిపై నమోదైన కేసును న్యాయస్థానం కొట్టేస్తూ బ్రౌన్‌ను విడుదల చేసింది.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

విమానాల్లో ఆ వస్తువులు అతిగా వేడెక్కుతున్నాయ్‌

యాపిల్‌ సీఈవోతో ముచ్చటించిన సిద్ధార్థ్‌, అదితి

అక్కడ తోడేళ్లు… ఇక్కడ నక్కలు.. మనుషులపై దాడులు

ఇకపై శాటిలైట్‌ ఆధారిత టోల్‌ వసూలు.. ఎంత దూరం ప్రయాణిస్తే అంతవరకే !!

అద్దెకుండేవారు చనిపోతే ఇంటికి తేకూడదా ??

Loading...
Unable to load recommendations.
Follow Us