నా భార్య పాము.. రాత్రి కాగానే కాటేస్తోంది

Updated on: Oct 09, 2025 | 8:31 PM

ఉత్తరప్రదేశ్‌లోని సీతాపూర్ జిల్లాలో వింత ఘటన చోటుచేసుకుంది. ఓ వ్యక్తి... తన భార్య రాత్రయితే చాలు పాములా మారిపోతోందని, తనను కాటేసేందుకు ప్రయత్నిస్తుందంటూ పోలీసులను ఆశ్రయించడం హాట్‌టాపిక్‌గా మారింది. సీతాపూర్‌ జిల్లాలో మెరాజ్‌ అనే వ్యక్తి ప్రజా ఫిర్యాదుల దినోత్సవం సందర్భంగా జిల్లా మేజిస్ట్రేట్‌ను కలిసి, తన భార్య నసీమున్‌పై చేసిన ఆరోపణ అక్కడ ఉన్నవారిని ఆశ్చర్యానికి గురిచేసింది.

మెరాజ్ ఆరోపణల ప్రకారం.. తన భార్య రాత్రివేళల్లో పాములా బుసలు కొడుతూ తనను భయభ్రాంతులకు గురిచేస్తుందని ఫిర్యాదు చేశాడు. నిద్రించేటప్పుడు మామూలుగానే పడుకుంటున్నా.. అర్థరాత్రి కాగానే ఒక్కసారిగా పాములా మారి తన వెంటపడుతూ కాటు వేయడానికి ప్రయత్నించిందని, తాను భయంతో నిద్ర లేని రాత్రులు గడుపుతున్నానని చెప్పాడు. ఆమె మానసిక స్థితిపై అనుమానం కలుగుతోందని తెలిపాడు. ఈ విషయమై తాను స్థానిక పోలీసులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడంలేదని ఆవేదన వ్యక్తం చేశాడు. చివరికి జిల్లా అధికారుల సహాయాన్ని కోరాల్సి వచ్చిందని చెప్పాడు. జిల్లా మేజిస్ట్రేట్ ఈ ఘటనపై విచారణకు ఆదేశించారు. సబ్-డివిజనల్ మేజిస్ట్రేట్‌తో పాటు పోలీసులకు దీనిపై సమగ్రంగా దర్యాప్తు చేయాలని చెప్పినట్లు సమాచారం. ఈ కేసు మానసిక వేధింపుల కోణంలోనూ పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది. ఇక ఈ సంఘటనపై సోషల్ మీడియాలో నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. ‘బ్రో ఒక పనిచేయి.. నువ్వు కూడా కోబ్రాలా మారిపో’ అంటూ సరదా కామెంట్లు చేస్తున్నారు. మరికొంతమంది 1986లో వచ్చిన శ్రీదేవి నటించిన నాగిని సినిమాను ఉదహరిస్తూ చమత్కారాలు చేస్తున్నారు. అతను చాలా అదృష్టవంతుడు. తన భార్య శ్రీదేవిలా ఉంది అనే పోస్టులు వైరల్ అవుతున్నాయి. మెరాజ్ జిల్లా అధికారులకు ఇచ్చిన లిఖితపూర్వక ఫిర్యాదులో తన భార్య ఇప్పటికే ఒకసారి నిజంగా అతనిని కరిచినట్లు, ప్రతి రాత్రి ఆమె పాముగా మారి తన వెంట పరిగెడుతుందని స్పష్టంగా పేర్కొన్నాడు. న్యాయపరంగా ఇది ఎంతవరకు నమ్మదగినదో అనేది అధికారుల విచారణ తరువాతే స్పష్టం కానుందని అధికారులు తెలిపారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఇక.. ఈపీఎఫ్ కనీస పింఛన్ రూ. 2500.. ఆ రోజే నిర్ణయం

Today Gold Price: బంగారం ధరలు ఆగేదెప్పుడు ?? తులం ఎంతంటే ??

Thalapathy Vijay: ఓదార్పు యాత్ర చేయాలి.. పర్మిషన్ ప్లీజ్

గ్యాస్‌ సిలిండ‌ర్ల లారీని ఢీకొన్న పాల ట్యాంక‌ర్‌.. తర్వాత

గాజుల షాపులో నాగుపాము.. కస్టమర్ల పరుగో పరుగు