Cycle Ride: మీరెప్పుడైనా సైకిల్‌ ఇలా తొక్కారా..? ఓర్నీ..! ఈ బుడ్డోళ్ల ఐడియా అదిరిందిగా..

|

Jun 07, 2023 | 9:41 PM

చిన్నప్పుడు అందరూ సైకిల్‌ తొక్కే ఉంటారు. రెండు చక్రాలు కలిగిన ఈ వాహనంపై ప్రయాణం అంటే ఆరోగ్యానికి ఆరోగ్యం.. ఆదాకి ఆదా.. ఏ వాహనమైనా ఏకకాలంలో ఒక్కరే నడపగలరు. ఇద్దరు కలిసి ఒకేసారి వాహనాన్ని నడపలేరు. అలాచేయాల్సి వస్తే.. ఒకరి తర్వాత ఒకరు విరామం తీసుకుంటూ వాహనాన్ని నడుపుతారు.

సాధారణంగా సైకిలుకి ఒక్కటే సీటు ఉంటుంది. వెనుక క్యారేజ్ సీటుపై కూర్చున్న వారు వీలైతే పెడల్స్ పై తమ కాళ్లను సపోర్ట్ గా వేసి సైకిల్‌ తొక్కుతున్న వారికి సాయం చేయొచ్చు. అంతేగానీ, ఒకే సైకిల్‌ను ఒకే సారి ఇద్దరు తొక్కటం ఎక్కడైనా, ఎప్పుడైనా చూశారా..? అంతేకాదు.. ఈ వీడియో చూస్తే టీమ్ వర్క్ కి సరైన అర్థం ఇదే అనకమానరు. ఈ వీడియోలో ఇద్దరు అబ్బాయిలు సైకిలుకి రెండువైపులా ఉన్న పెడల్స్‌పైన అటొకరు, ఇటొకరు నిలుచున్నారు. అలా ఇద్దరూ ఏకకాలంలో వేగంగా సైకిల్‌ తొక్కుకుంటూ వెళ్తున్నారు. పైగా అలా సైకిల్‌ తొక్కే సమయంలో వారు ఎలాంటి తడబాటు పడకుండా చాలా సంతోషంగా, ఉత్సాహంగా తొక్కుకుంటూ వెళ్తున్నారు. నెట్టింట దూసుకుపోతున్న ఈ వీడియోను ఇప్పటికే రెండు మిలియన్ల మంది వీక్షించారు. వేలాదిమంది లైక్‌ చేస్తూ తమదైనశైలిలో కామెంట్లు చేస్తున్నారు. చిన్నారుల ఐడియాను మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos
NTR30 1ST LOOK: అతనిది రక్తంతో రాసిన కథ.. ఇక ఊచాకోతనే..! ఎన్టీఆర్ అదిరిపోయే లుక్.

Pawan Kalyan: కాలాన్ని శాసించే దేవుడే “బ్రో”..! గూబ గుయ్ మనే రీసౌండ్‌తో పవన్ వీడియో.

Pawan Kalyan OG: పవన్ కళ్యాణ్ మరో అధ్యాయం మొదలైంది.. మరోపక్క భాగ్యనగరంలో ఓజీ.