వీడసలు టీచరేనా.. విద్యార్థినిని ఏమార్చి.. అలా ఎలా చేసాడు… చిన్న పిల్లరా
తిరుపతిలో షాకింగ్ ఘటన: ఉపాధ్యాయుడు జలపతిరెడ్డి పాఠశాలలో మైనర్ విద్యార్థినిపై ఏళ్లుగా లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఫలితంగా ఆ బాలిక గర్భం దాల్చింది. తల్లి ఫిర్యాదుతో పోలీసులు పోక్సో కేసు నమోదు చేసి నిందితుడిని అరెస్టు చేశారు. కన్నబిడ్డల్లా చూడాల్సిన గురువు ఇలా అమానుషంగా ప్రవర్తించడంపై తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది. ఇలాంటి నేరాలకు కఠిన శిక్షలు పడాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
తల్లిదండ్రులు ఉపాధ్యాయులపై ఎంతో నమ్మకంతో తమ పిల్లలను పాఠశాలకు పంపిస్తారు. తల్లిదండ్రుల తర్వాత అంత బాధ్యతగా చూసుకోవాల్సిన ఉపాధ్యాయులు కొందరు విద్యార్థినిల పట్ల అమానుషంగా ప్రవర్తిస్తున్నారు. కన్నబిడ్డల్లా చూడాల్సిన విద్యార్ధులను కామంతో చూస్తున్నారు. మాయమాటలు చెప్పి లోబరచుకుని వారి జీవితాలనే నాశనం చేస్తున్నారు. తిరుపతిలో అలాంటి ఘటనే జరిగింది. ఓ విద్యార్ధినిపై ఏళ్లతరబడి లైంగిక దాడికి పాల్పడ్డాడు ఓ ఉపాధ్యాయుడు. ఫలితంగా బాలిక గర్భం దాల్చడంతో తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. తిరుపతిలోని ఓ ప్రైవేట్ స్కూల్ లో జలపతిరెడ్డి సోషల్ టీచర్‌గా పనిచేస్తున్నాడు. అదే స్కూల్ లో చదువుతున్న మైనర్ స్టూడెంట్ పై కన్నేశాడు. పాఠాలు చెప్పే నెపంతో విద్యార్ధినితో చనువు పెంచుకున్నాడు. 55 ఏళ్ల జలపతి రెడ్డి ప్రస్తుతం ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్న స్టూడెంట్ నెల తప్పేలా చేసాడు. స్టూడెంట్ ప్రెగ్నెంట్ కావడం ఇంట్లో తెలియడంతో తల్లి నిలదీసింది. విషయం మొత్తం విద్యార్ధిని తల్లికి చెప్పింది. వెంటనే తల్లి కుమార్తెను తీసుకొని వెళ్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో జలపతి రెడ్డి యవ్వారం బయటపడింది. విద్యార్ధిని తల్లి ఫిర్యాదు మేరకు తిరుపతి ఈస్ట్ పోలీసులు ఫోక్సో కేసు నమోదు చేసి నిందితుడిని అరెస్ట్ చేసారు. జలపతిరెడ్డి మూడేళ్లుగా విద్యార్ధినితో రిలేషన్‌షిప్ మెయింటెయిన్ చేస్తున్నట్టు తేలింది. నిందితుడిని అరెస్టు చేసిన పోలీసులు నిందితుడిని కోర్టులో హాజరుపరిచారు. ఉపాధ్యాయుడై ఉండి జలపతిరెడ్డి చేసిన పనికి స్థానికులు తీవ్రంగా మండిపడుతున్నారు. ఇలాంటివారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Divvela Madhuri: బిగ్ బాస్ విన్నర్ ఎవరో చెప్పేసిన మాధురి
ప్రేమ విషయంలో మరో హింట్ ఇచ్చిన జాన్వీ
అంతర్జాతీయ జాబితాలో సౌత్ సినిమాల హవా.. అట్లుంటది మనతోని
