ఇంట్లో చోరీకి వచ్చి ఆ దొంగ చేసిన పనికి.. నవ్వకుండా ఉండలేరు!
హైదరాబాద్ పాతబస్తీలో దొంగతనానికి వచ్చిన ఓ వ్యక్తి విచిత్రంగా దొరికిపోయాడు. వాది-ఏ-ముస్తఫా ప్రాంతంలోని ఓ ఇంట్లోకి చోరీకి ప్రవేశించిన అతడు మద్యం మత్తులో మంచంపైనే నిద్రపోయాడు. తెల్లవారుజామున ఇంటి యజమాని అతడిని గమనించి వీడియో తీస్తూ నిద్రలేపాడు. తాను దొంగతనానికే వచ్చానని, నిద్ర రావడంతో అక్కడే పడుకున్నానని ఆ వ్యక్తి చెప్పడంతో యజమాని, స్థానికులు ఆశ్చర్యపోయారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
హైదరాబాద్ పాతబస్తీలో ఒక విచిత్రమైన ఘటన చోటుచేసుకుంది. సాధారణంగా దొంగలు ప్లాన్ ప్రకారంగా వచ్చి, దొరికినంత దోచుకుని తెల్లారేలోపు పరారవుతారు. కానీ, ఇక్కడ ఓ దొంగ మాత్రం దొంగతనం సంగతి పక్కనపెట్టి, ఆ యజమాని మంచంపైనే హాయిగా పడుకొని..గాఢ నిద్రలోకి జారుకున్నాడు. తెల్లారిన తర్వాత వచ్చి చూసిన యజమానికి నిద్రపోతున్న దొంగ రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయాడు. పాతబస్తీలోని వాది-ఏ-ముస్తఫా ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. ఫుల్ మత్తులో ఉన్న ఓ వ్యక్తి దొంగతనం చేసేందుకు ఓ ఇంట్లోకి ప్రవేశించాడు. లోపలికి వెళ్లి విలువైన వస్తువుల కోసం వెతికినప్పటికీ, విపరీతమైన మత్తు, అలసట కారణంగా అతడికి నిద్ర ముంచుకొచ్చేసింది. దాంతో అతను “ఈ రాత్రికి ఇక్కడే రెస్ట్ తీసుకుందాం..తెల్లారగట్లే లేచి వెళ్లిపోదాం అనుకున్నట్టున్నాడు..వెంటనే అక్కడ దిండు వేసుకొని హాయిగా నిద్రపోయాడు. తెల్లవారిన తర్వాత ఇంటి యజమాని తలుపు తెరిచి లోపలికి వెళ్లగా, ఒక వ్యక్తి హాయిగా నిద్రపోతుండటం చూసి షాక్ అయ్యాడు. వెంటనే తేరుకుని సెల్‌ఫోన్‌లో వీడియో రికార్డు చేస్తూ నిద్రలేపాడు. “ఎవరు నువ్వు.. మా ఇంట్లోకి ఎందుకు వచ్చావు?” అని అడిగాడు. ఆ వ్యక్తి ఏమాత్రం తడబడకుండా “నేను దొంగతనానికే వచ్చా.. కానీ నిద్రొచ్చి పడుకున్నా” అంటూ నిజం చెప్పేశాడు. దొంగ చెప్పిన ఈ అమాయకపు సమాధానం విని యజమానితో పాటు స్థానికులు కూడా ఆశ్చర్యపోయారు. ప్రస్తుతం ఈ విచిత్ర ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. దొంగను పోలీసులు వెతకాల్సిన పని లేకుండా, అతడి నిద్రే స్వయంగా పట్టించిందంటూ నెటిజన్లు తెగ నవ్వుకుంటూ కామెంట్లు పెడుతున్నారు. ఘటనపై కేసు నమోదుచేసి పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
రోడ్డు పై పులి ప్రత్యక్షం.. సెల్ఫీల కోసం ఎగబడిన జనం
హాస్టల్‌లో దెయ్యం..! భయంతో ఖాళీ చేసి వెళ్లిపోయిన విద్యార్ధినిలు
