Viral Video: కుక్కపిల్ల సూపర్‌ హీరో.. సుడిగాలినే బంధించి నగరాన్ని కాపాడింది.! ఫన్నీ వీడియో చూస్తే నవ్వులే నవ్వులు..

Updated on: Jul 01, 2022 | 8:59 AM

వేగంగా, దట్టమైన దుమ్ము దూళితో కలిసి సుడులు తిరుగుతూ వీచే గాలులు.. బలమైన సుడిగాలినే టోర్నడోలు అంటారు. టోర్నడోల అమెరికా వంటి దేశాల్లో బీభత్సం సృష్టిస్తుంటాయి.


వేగంగా, దట్టమైన దుమ్ము దూళితో కలిసి సుడులు తిరుగుతూ వీచే గాలులు.. బలమైన సుడిగాలినే టోర్నడోలు అంటారు. టోర్నడోల అమెరికా వంటి దేశాల్లో బీభత్సం సృష్టిస్తుంటాయి. గత నెలలో అమెరికాలో వచ్చిన టోర్నడోలు బీభత్సానికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌ అయ్యాయి. అయితే, అలాంటి టోర్నడోలు కొన్నిసార్లు చాలా చిన్నవిగా కూడా ఉంటాయి. తాజాగా రోడ్డుపై చిన్న టోర్నడో వీడియో వైరల్ అవుతోంది. ఇక్కడ తమాషా ఎంటంటే..ఈ సుడిగాలితో సరదాగా ఆడుకుంటోంది ఓ బుజ్జి కుక్కపిల్ల. రోడ్డుపై అకస్మాత్తుగా చిన్న టోర్నడో ఏర్పడింది. అంతలోనే ఓ బుజ్జికుక్కపిల్ల అటుగా వచ్చింది. పైపైకి లేస్తున్న సుడిగాలిని అది ఆపాలని ట్రై చేస్తోంది. పదే పదే సుడిగాలిని నోటితో పట్టేయాలని దానితో కుస్తీ పడుతోంది. గాలిని పట్టేసేందుకు కుక్క పిల్ల పడుతున్న తంటాలు మామూలుగా లేవు..ఆ గాలి ఎటు వెళితే..అటు పరిగెత్తుకుంటూ వెళ్తోంది. ఆ గాలిని తన నోటితో కొరికేయాలని ప్రయత్నిస్తోంది. దాని పిచ్చికాకపోతే, ఎక్కడైనా సుడిగాలి కుక్క నోటికి చిక్కుతుందా..? కానీ, కుక్కపిల్ల ఆట మాత్రం భలేగా ఉంది. ఇదంతా వీడియో తీసిన కొందరు స్థానికులు సోషల్ మీడియాలో పోస్ట్‌ చేశారు. దాంతో వీడియో కాస్త వైరల్‌గా మారింది. నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Employee: ఎంప్లాయి అంకితభావానికి సంస్థ సత్కారం.. ఒక్క ఆఫ్ లేకుండా 27 ఇయర్స్..

Omelette challenge: ఈ ఆమ్లెట్‌ తిన్న వారికి.. రూ. 21వేలు గెలుచుకోండి.! ఎక్కడో తెలుసా..?

Kacha Badam on flute: వేణువుపై కచ్చాబాదం సాంగ్‌ పాడిన యువకుడు.! నెట్టింట రచ్చ లేపుతున్న వీడియో..

Published on: Jul 01, 2022 08:59 AM
Loading...
Unable to load recommendations.
Follow Us