మా తల్లే.. గౌను గుండీల వెనుక ఇంత గూడుపుఠాణి ఉందా !!

|

May 26, 2022 | 8:54 PM

నిజంగా డ్రగ్స్‌కి మన దేశంలో యువత ఇంతలా బానిసలయ్యారా అనిపిస్తుంది.. స్మగ్లర్లు పాడుతున్న కథలు చూస్తుంటే. సీఎం కేసీఆర్ పదే, పదే నొక్కి చెబుతున్నట్లు డ్రగ్స్‌పై ఉక్కుపాదం మోపకపోతే..

నిజంగా డ్రగ్స్‌కి మన దేశంలో యువత ఇంతలా బానిసలయ్యారా అనిపిస్తుంది.. స్మగ్లర్లు పాడుతున్న కథలు చూస్తుంటే. సీఎం కేసీఆర్ పదే, పదే నొక్కి చెబుతున్నట్లు డ్రగ్స్‌పై ఉక్కుపాదం మోపకపోతే.. యువత భవిష్యత్ అంధకారంలోకి వెళ్లే ప్రమాదం ఉంది. స్మగ్లర్స్‌ వేసే కొత్త కొత్త ఐడియాలకు అధికారులకు దిమ్మదిరిగిపోతుంది. తాజాగా ఇథియోపియా నుంచి ఢిల్లీకి వచ్చిన ఓ మహిళ నుంచి దాదాపు 25 కోట్ల విలువైన కొకైన్‌ను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. ఆమెకే ఈ ఐడియా వచ్చిందో.. మరెవరైనా చెప్పారో తెలియదు కానీ.. 30 గౌన్ల బటన్లలో చాకచక్యంగా కొకైన్ దాచి.. తీసుకొచ్చింది. అయితే అధికారులు.. నిఘా పెట్టి ఆమెను అదుపులోకి తీసుకున్నారు. నిందితురాలు నైజీరియా దేశస్థురాలిగా చెబుతున్నారు. గౌనులను పరిశీలించిన అనంతరం కస్టమ్స్‌ విభాగం అధికారలు దుస్తుల్లోని డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

తప్పతాగి పరీక్ష సెంటర్ కు వచ్చిన ఇన్విజిలేటర్.. చివరికి ??

మంచంతో తహసీల్దారు ఆఫీసుముందు నిరసన !! ఎందుకో తెలుసా ??

Vijay Deverakonda: స్పీడ్ పెంచిన దేవరకొండ.. మరో డైరెక్టర్‏కు గ్రీన్ సిగ్నల్..

 

Published on: May 26, 2022 08:54 PM