Viral: అత్త చెవిని చికెన్‌ ముక్కలా కొరికేసిన కోడలు.. ఆ రాత్రి ఏం జరిగిందంటే.?

|

Oct 13, 2024 | 11:45 AM

అత్తా కోడళ్ల పోరు అంటే.. మామూలుగా ఉండదు మరి.. ఇలాంటి కుటుంబ కలహాలు, వివాదాలు అన్నిచోట్ల కనిపించే వ్యవహారమే. అయితే.. ఓ కోడలు మరో అడుగు ముందుకు వేసింది.. అత్తతో గొడవపడిన కోడలు.. ఏకంగా అత్త చెవిని కొరికేసింది. ఈ ఘటన ఆంధ్రప్రదేశ్‌ లోని గుంటూరు జిల్లాలో చోటుచేసుకుంది. గుంటూరు జిల్లా తుళ్లూరులో నివసిస్తున్న కంభంపాటి శేషగిరి, భార్య, పావని, తల్లి నాగమణి, ఇద్దరు కుమారులతో జీవనం సాగిస్తున్నారు.

అత్తా కోడళ్ల పోరు అంటే.. మామూలుగా ఉండదు మరి.. ఇలాంటి కుటుంబ కలహాలు, వివాదాలు అన్నిచోట్ల కనిపించే వ్యవహారమే. అయితే.. ఓ కోడలు మరో అడుగు ముందుకు వేసింది.. అత్తతో గొడవపడిన కోడలు.. ఏకంగా అత్త చెవిని కొరికేసింది. ఈ ఘటన ఆంధ్రప్రదేశ్‌ లోని గుంటూరు జిల్లాలో చోటుచేసుకుంది. గుంటూరు జిల్లా తుళ్లూరులో నివసిస్తున్న కంభంపాటి శేషగిరి, భార్య, పావని, తల్లి నాగమణి, ఇద్దరు కుమారులతో జీవనం సాగిస్తున్నారు. అయితే అత్తా కోడళ్లకు కొన్ని రోజులుగా పడటంలేదు. తరచూ ఏదొక విషయంపై గొడవలు పడుతున్నారు. ఈ క్రమంలో పావనికి, నాగమణికి మధ్య ఆదివారం రాత్రి మళ్లీ గొడవ జరిగింది.

ఈసారి ఇద్దరి మధ్య వాగ్వాదం తారాస్థాయికి చేరింది.. దీంతో కొడలు పావని క్షణికావేశంలో అత్త నాగమణి చెవిని కొరికేసింది. దీంతో నాగమణి చెవి భాగం మొత్తం ఊడిపోయింది. అనంతరం అప్రమత్తమైన కుటుంబసభ్యులు.. స్థానికులు నాగమణిని తెగిన చెవితోపాటు తుళ్లూరు పీహెచ్‌సీకి తరలించారు. ప్రాథమిక చికిత్స అనంతరం అక్కడి నుంచి గుంటూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అయితే.. అప్పటికే ఆలస్యం అవ్వడం వల్ల.. తెగిన చెవి అతుక్కోవడం కష్టమని వైద్యులు చెప్పారు. దీంతో చేసేదేం లేక అక్కడే చికిత్సను కొనసాగిస్తున్నట్లు బాధితురాలి కుటుంబ సభ్యులు తెలిపారు. అయితే ఈ ఘటనపై ఎలాంటి కేసు నమోదు కాలేదని, బాధితులు ఫిర్యాదు చేస్తే తదనుగుణంగా చర్యలు తీసుకుంటామని పోలీసులు వెల్లడించారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.