ఇల్లు పీకి పందిరేస్తున్నాయి పంట పొలాలు నాశనం.. పిల్లల పై దాడులు! తెలంగాణలో అసలు ఏం జరుగుతోంది?

Updated on: Sep 14, 2026 | 8:31 PM

తెలంగాణలో కోతుల బెడద తీవ్ర సమస్యగా మారింది. రాష్ట్రంలో 50 లక్షలకు పైగా కోతులు ఉండగా, పంట నష్టం, మనుషులపై దాడులతో ప్రజలు భయాందోళన చెందుతున్నారు. ప్రస్తుతం ఉన్న ఏకైక పునరావాస కేంద్రం సరిపోవడం లేదు. క్లస్టర్ల వారీగా కొత్త స్టెరిలైజేషన్ కేంద్రాలు ఏర్పాటు చేసి, మానవ-వన్యప్రాణి సంఘర్షణకు శాశ్వత పరిష్కారం కనుగొనాలని నిపుణులు సూచిస్తున్నారు.

తెలంగాణను కోతుల బెడద తీవ్రంగా వేధిస్తోంది. అటవీ శాఖ నివేదికల ప్రకారం రాష్ట్రంలో కోతుల సంఖ్య ఏకంగా 50 లక్షలు దాటింది, ఇందులో 10 లక్షల వరకు పిల్ల కోతులే ఉన్నాయి. పల్లెల నుంచి పట్టణాల వరకు ప్రజలను నిద్రపట్టనీయకుండా చేస్తున్న ఈ సమస్య వ్యవసాయ రంగాన్ని, ప్రజల దైనందిన జీవితాన్ని ప్రభావితం చేస్తోంది. నిజామాబాద్, కరీంనగర్, సిద్దిపేట వంటి జిల్లాల్లో రైతులు పంట నష్టంతో అల్లాడుతుండగా, పట్టణాల్లో అపార్ట్‌మెంట్లపై దాడులు, పిల్లలపై భయంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. పంచాయతీలు, మున్సిపాలిటీలు కోతులను పట్టుకోవడానికి ప్రైవేట్ వ్యక్తులను ఆశ్రయించి లక్షల రూపాయలు ఖర్చు చేస్తున్నాయి. అయితే, ఇది తాత్కాలిక పరిష్కారం మాత్రమేనని నిపుణులు చెబుతున్నారు. 2020లో నిర్మల్ జిల్లాలో 2.25 కోట్ల వ్యయంతో ఏర్పాటు చేసిన కోతుల పునరావాస, స్టెరిలైజేషన్ కేంద్రం నెలకు కేవలం 100-150 ఆపరేషన్లు మాత్రమే చేయగలదు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న భారీ కోతుల సంఖ్యకు ఇది ఏమాత్రం సరిపోవడం లేదు. అటవీ క్షీణత, ఆహార కొరత, మనుషులు కోతులకు ఆహారం అందించడం వంటివి ఈ సమస్యకు ప్రధాన కారణాలు. ప్రతి మూడు జిల్లాలకు ఒక క్లస్టర్ కేంద్రం ఏర్పాటు చేయాలని అటవీ శాఖ ప్రభుత్వాన్ని కోరుతోంది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

బరువు తగ్గాలనుకుంటున్నారా..? CMR-NIN పరిశోధనలో సంచలన నిజాలు

లీటర్‌కు రూ.80 కోట్లు.. తేలు విషం రహస్యం ఇదే!

వైభవ్‌ లాంటి ఒక్క బ్యాటర్‌నైనా తయారు చేశారా? పాకిస్థాన్‌కు వసీం అక్రమ్‌ చురకలు

వలలో చిక్కిన 23 కేజీల “పండుగప్ప”.. వేలంలో కళ్లుచెదిరే రేటు!

ఇక గోరింటాకు కూడా మెషీన్‌తోనే.. మరికొన్ని ఉద్యోగాలు హుష్‌!

Loading...
Unable to load recommendations.
Follow Us