Telangana: వినాయక నిమజ్జనం తర్వాత వర్సిటీ గర్ల్స్‌ హాస్టల్‌లో వీసీ డాన్స్‌లు.. ఆలస్యంగా బయటకి వచ్చిన ఒరిజినల్ వీడియోస్..

Updated on: Sep 15, 2022 | 1:06 PM

నిజామాబాద్‌లోని తెలంగాణ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ కొత్త వివాదంలో చిక్కుకున్నారు. వీసీ రవీందర్‌ గుప్తా‌ తీరుపై విద్యార్థి సంఘాలు భగ్గుమంటున్నాయి. వినాయక నిమజ్జనం తర్వాత గర్ల్స్ హాస్టల్‌కి వీసీ వెళ్లడాన్ని..


నిజామాబాద్‌లోని తెలంగాణ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ కొత్త వివాదంలో చిక్కుకున్నారు. వీసీ రవీందర్‌ గుప్తా‌ తీరుపై విద్యార్థి సంఘాలు భగ్గుమంటున్నాయి. వినాయక నిమజ్జనం తర్వాత గర్ల్స్ హాస్టల్‌కి వీసీ వెళ్లడాన్ని తప్పుబడుతున్నారు. గేట్‌ క్లోజ్‌ చేసి ఉన్నా బలవంతంగా తెరిపించిన వీసీ లోపలికి వెళ్లి డాన్సులు చేశారు. తనతోపాటు ఇద్దరు ప్రైవేట్‌ వ్యక్తుల్ని కూడా వెంట పెట్టుకుని రవీందర్‌ గుప్తా వెళ్లడం ఇప్పుడు చర్చనీయాంశమైది. విద్యార్థినులతో డాన్సులు.. ఆపై డబ్బులు పంచడాలు.. ఈ దృశ్యాలన్నీ కెమెరాల్లో రికార్డ్ అయ్యాయి. తెలంగాణ వర్సిటీ వైస్ ఛాన్సలర్ అయ్యుండి.. ఇలా స్థాయి మరిచి ప్రవర్తించడం ఏంటని విద్యార్థి సంఘాలు ప్రశ్నిస్తున్నాయి. హాస్టల్‌లోకి ఇతరుల ప్రవేశంపై నిషేధం ఉన్నా పట్టించుకోకుండా వైస్‌ ఛాన్సిలరే నిబంధనలు ఉల్లంఘించడని ఆరోపిస్తున్నారు విద్యార్థి సంఘ నేతలు

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

MLA viral video: ప్రభుత్వ పాఠశాల టాయిటెట్స్ శుభ్రం చేసిన ఎమ్మెల్యే.. అశుభ్రంగా ఉండటంపై సీరియస్..(వీడియో)

Auntys dance video: అట్లుంటది మరి ఆంటీస్ రంగంలోకి దిగితే.. దుమ్ములేచిపోవాల్సిందే.. ఆంటీలు మీరు కేక..

Variety Thief video: వీడో వెరైటీ దొంగ.. ఏం దొంగతనం చేశాడో చూస్తే ఆశ్చర్యపోవడమే కాదు.. ఛీ.. అంటారు..

Published on: Sep 15, 2022 01:06 PM