నన్ను చంపొద్దురా నాన్న అని వేడుకున్నా..కన్నీరు పెట్టిస్తున్న వీడియో
చిన్నప్పుడు గోరుముద్దలు తినిపించి కంటికి రెప్పలా కాపాడిన తల్లి అతనికి భారంగా మారింది. జీవిత చరమాంకంలో ఆపసోపాలు పడుతున్న ఆ తల్లికి అండగా నిలవాల్సిన కొడుకే కాల యముడిగా మారాడు. వృద్దాప్యంలో సేవలు చేయాల్సి వస్తుందని జన్మనిచ్చిన తల్లిని కడతేర్చాడు. ఆసుపత్రిలో చికిత్స చేయిస్తానని చెప్పడంతో ఆశతో అతనితో వెళ్లిన అమ్మను మంజీరా నదిలో తోసేసి చేతులు దులుపుకున్నాడు.
చిన్నప్పుడు గోరుముద్దలు తినిపించి కంటికి రెప్పలా కాపాడిన తల్లి అతనికి భారంగా మారింది. జీవిత చరమాంకంలో ఆపసోపాలు పడుతున్న ఆ తల్లికి అండగా నిలవాల్సిన కొడుకే కాల యముడిగా మారాడు. వృద్దాప్యంలో సేవలు చేయాల్సి వస్తుందని జన్మనిచ్చిన తల్లిని కడతేర్చాడు. ఆసుపత్రిలో చికిత్స చేయిస్తానని చెప్పడంతో ఆశతో అతనితో వెళ్లిన అమ్మను మంజీరా నదిలో తోసేసి చేతులు దులుపుకున్నాడు. వద్దురా నాన్న అని ఆ తల్లి ఎంత వేడుకున్నా వాడి మనసు కరగలేదు. పోలీసుల విచారణలో అసలు విషయం బయటపడింది. ఈ హృదయ విదారకర ఘటన కామారెడ్డి జిల్లాలో చోటుచేసుకుంది.ఎర్రోళ బాలయ్య అనే వ్యక్తి తల్లిని బాన్సువాడ ఏరియా ఆస్పత్రిలో చూయిస్తానని తీసుకెళ్లి మంజీరా నదిలో తోసేసి హైదరాబాద్ పరారయ్యాడు. మంజీరా నదిలో గుర్తు తెలియని వృద్ధురాలి శవం దొరికిందని పిట్లం పోలీసులు ఫోటోను సోషల్ మీడియాలో వైరల్ చేశారు. ఆ వృద్దురాలు తమ ఊరికి చెందిన సాయవ్వగా గుర్తించిన బాన్సువాడ మండలం బొర్లం గ్రామస్థులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. సాయవ్వను కొడుకు, మరో బాలుడు ఆస్పత్రికి తీసుకెళ్లినట్లు గ్రామస్థులు పోలీసులకు సమాచారం ఇచ్చారు.
మరిన్నివీడియోల కోసం :
భయం లేదు.. అప్రమత్తంగా ఉంటే చాలు వీడియో
