పాలపిట్టను చూసేదెలా.. దాన్ని పట్టుకుంటే జైలుకే

Updated on: Oct 21, 2026 | 5:11 PM

దసరా పండుగ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర పక్షి పాలపిట్టను పట్టుకోవడం, బోనుల్లో బంధించడం, విక్రయించడం చట్టరీత్యా నేరమని ఇబ్రహీంపట్నం అటవీ శాఖ అధికారులు హెచ్చరించారు. సంప్రదాయం పేరుతో పక్షులను హింసించవద్దని ప్రజలకు సూచించారు. వన్యప్రాణి సంరక్షణపై అవగాహన కల్పించేందుకు ప్రత్యేక పోస్టర్లు ఏర్పాటు చేశారు. పాలపిట్టలను బంధించడం లేదా అక్రమంగా విక్రయించడం గమనిస్తే అటవీ శాఖకు సమాచారం అందించాలని కోరారు.

రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం ప్రాంతంలో అటవీ శాఖ అధికారులు వన్యప్రాణి సంరక్షణపై ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. దసరా పండుగ సమీపిస్తున్న వేళ, తెలంగాణ రాష్ట్ర పక్షి అయిన పాలపిట్టకు సంబంధించి కీలక ప్రకటన వెలువడింది. పాలపిట్టను పట్టుకోవడం, బోనుల్లో బంధించడం లేదా విక్రయించడం చట్టరీత్యా నేరమని ఇబ్రహీంపట్నం రేంజ్ అటవీ శాఖ అధికారులు స్పష్టం చేశారు. పండగ సంబరాల్లో భాగంగా ఆచారాల పేరుతో మూగజీవులను హింసించవద్దని వారు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. తెలంగాణ సంప్రదాయం ప్రకారం దసరా పర్వదినాన పాలపిట్ట దర్శనం శుభప్రదంగా భావిస్తారు. ఈ నేపథ్యంలో కొందరు వాటిని పట్టుకోవడానికి ప్రయత్నిస్తుంటారు. ఈ విషయంలో ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పించేందుకు అటవీ శాఖ అధికారులు ఇబ్రహీంపట్నంలోని పలు కీలక ప్రాంతాల్లో ప్రత్యేక అవగాహన పోస్టర్లను అంటించారు. వన్యప్రాణి రక్షణ చట్టం-1972 ప్రకారం షెడ్యూల్-II కింద పాలపిట్ట అత్యంత రక్షిత జాబితాలో ఉందని అధికారులు గుర్తుచేశారు. ఈ చట్టాన్ని ఉల్లంఘించి ఎవరైనా పాలపిట్టలను బంధిస్తే వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పండుగ సంతోషాన్ని ప్రకృతితో మమేకమై, మూగజీవులకు ఎలాంటి హాని తలపెట్టకుండా ప్రశాంతంగా జరుపుకోవాలని అధికారులు కోరారు. ఒకవేళ ఎక్కడైనా పాలపిట్టలను బోన్లలో పెట్టి ప్రదర్శించడం లేదా విక్రయించడం లాంటి చట్టవిరుద్ధ కార్యకలాపాలను గమనిస్తే, వెంటనే సమాచారం అందించాలని సూచించారు. బాధ్యులైన వారి వివరాలను లేదా అక్రమ రవాణాను అటవీ శాఖ టోల్‌ఫ్రీ నంబర్లు 1800 425 5364 లేదా 98033 38666 లకు ఫోన్ చేసి తెలపాలని కోరారు. ప్రజల సహకారంతోనే వన్యప్రాణుల సంరక్షణ సాధ్యమవుతుందని అధికారులు పేర్కొన్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

తగ్గిపోతున్న చందమామ సైజు.. భూమికి ప్రమాదం పొంచి ఉందా!

అంతరిక్షంలోకి వెళ్లిన తొలి పిల్లి .. ఆ తర్వాత..

పుట్టగానే పుష్ప అంటున్న బుడ్డోడు! చిన్నారి వీడియో వైరల్‌

ఎల్‌-నినో ముప్పు.. రాష్ట్రంలో తాగునీటి కటకట.. నీటి పొదుపే శ్రీరామరక్ష!

ఫస్ట్ జాబ్‌కే రూ.15,000.. కొత్త ఉద్యోగులకు బంపర్ బెనిఫిట్!

Loading...
Unable to load recommendations.
Follow Us