Teacher Crime: భార్య, పిల్లలను చితకబాది.. అర్ధనగ్నంగా మండుటెండలో నిలబెట్టిన భర్త.. వైరల్ అవుతున్న వీడియో..

Updated on: Sep 20, 2022 | 9:58 AM

రాజస్థాన్‌లో అమానుష ఘటన వెలుగులోకి వచ్చింది. రక్తబంధాలను సైతం కాదని దాష్టీకంగా వ్యవహరించాడు ఓ ఉపాధ్యాయుడు. భార్యను వివస్త్రను చేసి చితకబాదుతున్న..


రాజస్థాన్‌లో అమానుష ఘటన వెలుగులోకి వచ్చింది. రక్తబంధాలను సైతం కాదని దాష్టీకంగా వ్యవహరించాడు ఓ ఉపాధ్యాయుడు. భార్యను వివస్త్రను చేసి చితకబాదుతున్న ఓ ఉపాధ్యాయుడు అడ్డొచ్చిన కుమార్తెనూ విడిచిపెట్టకుండా చావగొట్టాడు. గదిలోనే కర్రలతో కొట్టి మరీ దారుణంగా ప్రవర్తించాడు. అంతటితో ఊరుకోక ఇద్దరినీ వీధిలోకి వెళ్లగొట్టాడు. అర్ధనగ్నంగా చేసి మండుతున్న ఎండలో ఇంటి ఆవరణలో కూర్చోబెట్టాడు. రాజస్థాన్‌లోని జోధ్‌పుర్‌ జిల్లా ఫలోదీ పట్టణంలో జరిగిన ఈ ఉదంతం సీసీ కెమెరాల్లో రికార్డయింది. వైరల్‌గా మారిన ఈ వీడియో పోలీసుల దృష్టికి వెళ్లడంతో నిందితుడు కైలాశ్‌ సుథార్‌ను అరెస్టు చేశారు. ప్రయివేటు స్కూల్ టీచరుగా పనిచేస్తున్న కైలాశ్‌.. తన భార్య మానసిక పరిస్థితి సరిగా లేదని పోలీసులకు తెలిపాడు. అయితే, కాలనీలో న్యూసెన్స్ సృష్టిస్తున్నారన్న కారణంగా కైలాశ్‌ను అరెస్టు చేశామని పోలీసులు తెలిపారు. బాధితురాలి వైపు నుంచి ఫిర్యాదు అందితే వేధింపుల చట్టం కింద కేసు నమోదు చేస్తామని ఫలోదీ పోలీస్‌ అధికారి రాకేశ్‌ ఖ్యాలియా తెలిపారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

MLA viral video: ప్రభుత్వ పాఠశాల టాయిటెట్స్ శుభ్రం చేసిన ఎమ్మెల్యే.. అశుభ్రంగా ఉండటంపై సీరియస్..(వీడియో)

Auntys dance video: అట్లుంటది మరి ఆంటీస్ రంగంలోకి దిగితే.. దుమ్ములేచిపోవాల్సిందే.. ఆంటీలు మీరు కేక..

Variety Thief video: వీడో వెరైటీ దొంగ.. ఏం దొంగతనం చేశాడో చూస్తే ఆశ్చర్యపోవడమే కాదు.. ఛీ.. అంటారు..