ఆ దేశంలో ఆఫీసులు .. స్వర్గానికి స్పాట్‌లు

Updated on: May 13, 2026 | 3:05 PM

ప్రపంచంలో ఏదేశపు ఉద్యోగులైనా.. కేవలం జీతం కోసమే కాకుండా, తమ అవసరాలను గుర్తించే ఒక మానవత్వమున్న పని ప్రదేశం కోసం ఎదురు చూస్తారు. చాలా సందర్భాలలో ఉద్యోగులు కంపెనీలను వదిలి వెళ్లడానికి కారణం కేవలం డబ్బు మాత్రమే కాదు, తమకు అక్కడ తగిన గుర్తింపు, మద్దతు లభించడం లేదనే భావనే ప్రధాన కారణం. యూరప్‌లోని స్వీడన్‌లో పనిచేస్తున్న ఓ భారతీయ టెకీ తన ఆఫీస్‌ గురించి షేర్ చేసిన వీడియో ప్రస్తుతం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఆ కార్పొరేట్ ఆఫీస్‌లో ఆశ్చర్యంగా ఎన్నో ప్రత్యేకతలున్నాయి. ఉద్యోగులు ఆఫీసులోని మెట్లపై కూర్చుని పనిచేసుకునే వెసులుబాటు ఉంది. ఒకేచోట కూర్చోవడం విసుగు అనిపిస్తే, ఆఫీసు బయటకు వెళ్లి ప్రకృతి మధ్యలో కూర్చుని కూడా పని పూర్తి చేయవచ్చు.

ఉద్యోగుల సంక్షేమానికి స్వీడెన్‌లోని యాజమాన్యాలు పెద్దపీట వేస్తాయని సంకేత్‌ చెప్పుకొచ్చారు. ఆఫీసులో చాక్లెట్ల బాక్స్‌, రోజూ సాయంత్రం స్వీడిష్ స్నాక్స్ కూడా ఉంటాయట. పని ఒత్తిడి ఎక్కువగా అనిపించినప్పుడు సేద తీరేందుకు మసాజ్ చెర్లను వాడుకోవచ్చు. ఆఫీసులోనే గేమ్స్ ఆడుకునే సౌకర్యం ఉంది. ఆ ఆఫీస్‌ వాతావరణం చాలా రిలాక్స్‌గా ఉంది, అది ఒక పని ప్రదేశంలా అనిపించదని సంకేత్ తన వీడియోలో వివరించారు. సాధారణ ఆఫీసుల్లో కనిపించే క్యూబికల్స్ పద్ధతి అక్కడ లేదు. ఓపెన్ డిజైన్‌ ఉంది. ఉద్యోగులు కంఫర్ట్‌ గా కూర్చునేందుకు బీన్ బ్యాగ్‌లు, కుర్చీలు, టేబుల్స్ ఉన్నాయి. ఓపెన్‌ డిజైన్ కారణంగా ఆఫీస్‌లో ఉన్నామనే ఫార్మల్ ఫీలింగ్ అస్సలు ఉండదనీ కుటుంబంతో గడపడం, సొంత హాబీలను కొనసాగించడం వల్ల ఉద్యోగులు మానసిక ప్రశాంతతతో ఉంటారని, అది వారి పనితీరును మరింత మెరుగుపరుస్తుందని సంకేత్‌ చెప్పుకొచ్చారు. ఉద్యోగులు తెగ పనిచేయాలని కానీ, వారాంతాల్లోనూ ఆఫీసుకు రావాలని గానీ అక్కడి కంపెనీలు కోరుకోవు.దీనివలన ఉద్యోగులు.. తమ పని ముగిశాక మిగిలిన సమయాన్ని వారి వ్యక్తిగత జీవితానికే వెచ్చిస్తారు.

మరిన్ని వీడియోల కోసం :

సేఫ్ గేమ్ ఆడుతున్న అమీర్ ఖాన్

మరో సీజన్ ప్లాన్ చేస్తోన్న..మనీ హెయిస్ట్

షూటింగ్ అప్డేట్స్.. ఏ హీరో ఎక్కడ ఉన్నాడంటే?

ఏంటీ ? వీళ్ల మధ్య ఉన్నది భార్య భర్తల బంధం కాదా?

Follow Us