Super fishing: ఏం ఐడియా బాసు నీది.. ఇతను చేపలు పట్టడం చూస్తే అవాక్కే..
సాధారణంగా చేపలను ఎలా పడతారు.. గాలం వేసో, వల వేసో పడతారు.. కానీ ఇక్కడ ఓ వ్యక్తి చేపలు పట్టడం చూస్తూ మీరు ఆశ్చర్యపోతారు. చేపలు పట్టడం ఇంత ఈజీనా అనుకుంటారు. ఇతని ఐడియాకి నెటిజన్లు ఫిదా అయిపోతున్నారు.
సాధారణంగా చేపలను ఎలా పడతారు.. గాలం వేసో, వల వేసో పడతారు.. కానీ ఇక్కడ ఓ వ్యక్తి చేపలు పట్టడం చూస్తూ మీరు ఆశ్చర్యపోతారు. చేపలు పట్టడం ఇంత ఈజీనా అనుకుంటారు. ఇతని ఐడియాకి నెటిజన్లు ఫిదా అయిపోతున్నారు. ప్రస్తుతం వీడియో నెట్టింట ఓ రేంజ్‌లో వైరల్ అవుతోంది. వైరల్ అవుతున్న వీడియోలో ఒక డ్యామ్ పైనుంచి నీరు ఉధృతంగా ప్రవహిస్తూ కిందకి పడుతోంది. అదే సమయంలో ఒక వ్యక్తి ఆనకట్ట దిగువన చేపలు పడుతున్నాడు. డ్యామ్ కింది భాగంలో చేపలు వేసే బుట్టలను ఉంచాడు. నీటి ప్రవాహానికి చేపలు ఆ బుట్టల్లో పడుతున్నాయి. దాంతో ఆ వక్తికి వలగానీ, గాలం గానీ వేసే పని తప్పింది. ఎలాంటి కష్టం లేకుండా నీటి ప్రవాహానికి వచ్చిన చేపలు ఆటోమేటిక్‌గా కింద ఉన్న బుట్టలో పడిపోతున్నాయి. ఈ వ్యక్తి ఫిషింగ్ కోసం చేసే పద్ధతి నిజంగా ప్రత్యేకమైనదనే చెప్పాలి. ఇతను చేపలు పట్టే విధానాన్ని చూసి నెటిజన్లు తెగ మెచ్చుకుంటున్నారు. ఈ వీడియోను ఓ యూజర్ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. ఈ వీడియోకు లైక్‌ల మీద లైక్‌లు వస్తున్నాయి. వేలాది మంది వీక్షించారు. నెటిజన్లు తమదైనశైలిలో ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Car – ambulance: అంబులెన్స్‌తో రేస్ పెట్టుకుని కారు డ్రైవర్.. సీన్ కట్ చేస్తే షాకింగ్ ఘటన.!
Employee: ఎంప్లాయి అంకితభావానికి సంస్థ సత్కారం.. ఒక్క ఆఫ్ లేకుండా 27 ఇయర్స్..
Omelette challenge: ఈ ఆమ్లెట్ తిన్న వారికి.. రూ. 21వేలు గెలుచుకోండి.! ఎక్కడో తెలుసా..?