Sunita Williams: ఏది నిజం.? ఏది అబద్ధం.? సునీతా-విల్ మోర్ ప్రాణాలతో తిరిగొస్తారా.?

|

Aug 26, 2024 | 10:10 AM

రోజు రోజుకీ భయాలు పెరిగిపోతున్నాయి. 8 రోజుల టూర్.. ఎప్పుడు తిరిగొస్తారో తెలియని స్థితికి చేరింది. దీంతో అన్ని రోజులు అంతరిక్షంలో ఉంటే తలెత్తే ఆరోగ్య సమస్యల గురించి రోజుకో కథనాలు వస్తున్నాయి. గతంలో యూఎస్ మిలటరీ స్పేస్‌లో పని చేసిన శాస్త్రవేత్తల మాటలు వింటూ ఉంటే.. అసలు సునీత - విల్ మోర్ ఇద్దరూ భూమికి తిరిగొచ్చే అవకాశం ఉందా లేదా.. వారిపై ఆశలు వదులుకోవాల్సిందేనా అన్న సందేహాలు కలుగుతున్నాయి.

రోజు రోజుకీ భయాలు పెరిగిపోతున్నాయి. 8 రోజుల టూర్.. ఎప్పుడు తిరిగొస్తారో తెలియని స్థితికి చేరింది. దీంతో అన్ని రోజులు అంతరిక్షంలో ఉంటే తలెత్తే ఆరోగ్య సమస్యల గురించి రోజుకో కథనాలు వస్తున్నాయి. గతంలో యూఎస్ మిలటరీ స్పేస్‌లో పని చేసిన శాస్త్రవేత్తల మాటలు వింటూ ఉంటే.. అసలు సునీత – విల్ మోర్ ఇద్దరూ భూమికి తిరిగొచ్చే అవకాశం ఉందా లేదా.. వారిపై ఆశలు వదులుకోవాల్సిందేనా అన్న సందేహాలు కలుగుతున్నాయి. తాజాగా గతంలో అమెరికా మిలటరీ స్పేస్ సిస్టమ్‌లో పని చేసిన రూడీ రిడాల్ఫీ తాజాగా చేసిన వ్యాఖ్యలు చూస్తే వణుకుపుడుతోంది.

3 రకాల ప్రమాదకర పరిణామాలు.?
క్యాప్సూల్ అతుక్కునే యాంగిల్ చాలా ముఖ్యం ఏ మాత్రం తేడా జరిగినా కష్టమే!
స్టార్ లైనర్ రీఎంట్రీ విషయంలో 3 రకాల ప్రమాదకర పరిణామాలు జరిగే అవకాశం ఉందని, ఆ విషయాల్లో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలని హెచ్చరిస్తున్నారు. నెంబర్ వన్ స్టార్ లైనర్ స్పేస్ క్రాఫ్ట్ సర్వీస్ మాడ్యూల్ ఎలైన్మెంట్ అత్యంత కీలకం అన్నది ఆయన మాట. ముఖ్యంగా స్పేస్ క్రాఫ్ట్ భూమికి సురక్షితంగా తిరిగి రావాలంటే సర్వీస్ మాడ్యూల్ సరిగ్గా అతుక్కోవాలని…క్యాప్సూల్‌ను సరైన కోణంలో అంటిపెట్టుకుంటేనే వారు సేఫ్‌గా భూమికి పైకి తిరిగి రాగలుగుతారని చెబుతున్నారు. మాడ్యూల్ కోణం ఏ మాత్రం సరిగ్గా లేకపోయినా అనేక దుష్పరిణామాలు జరిగే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు.

పరిమితంగానే ఆక్సిజన్ ఆర్బిట్లోనే ఉండిపోవచ్చు
ఒక వేళ స్టార్ లైనర్ స్పేస్ క్రాఫ్ట్ సరిగ్గా పని చేయకుండా అంతరిక్షంలోనే నిలిచిపోతే అప్పుడు అందులో కేవలం 96 గంటలకు సరిపడా ఆక్సిజన్ మాత్రమే ఉంటుంది. అయితే ఈ పరిస్థితి కేవలం క్యాప్సూల్ సరైన యాంగిల్లో అతుక్కోకపోయినప్పుడు మాత్రమే తలెత్తే ప్రమాదం ఉంది. ఒక వేళ సరైన యాంగిల్లో అతుక్కోకపోతే భూవాతావరణంలోకి రాకుండా ఆర్బిట్లోనే ఉండిపోవచ్చు. అప్పుడు 96 గంటలకు మాత్రమే సరిపడా ఆక్సిజన్ ఉన్నందున వ్యోమగాముల ప్రాణాలకు ప్రమాదం జరగొచ్చు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.