Telangana: ‘మమ్మల్ని వదిలి వెళ్లకండి సార్..’ గుక్కెట్టి ఏడ్చిన పిల్లలు

Updated on: Jul 19, 2024 | 1:28 PM

తెలంగాణలో ఉపాధ్యాయుల బదిలీ ప్రక్రియ నేపథ్యంలో ఆయా పాఠశాలల్లో ఏళ్ల తరబడి విద్యాబోధన చేసిన ఉపాధ్యాయులు ట్రాన్స్‌ఫర్ అయి వెళ్తున్నారు. ఈ సందర్భంగా మాస్టారు మమ్మల్ని విడిచిపెట్టొద్దని స్కూల్ స్టూడెంట్స్ కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఈ దృశ్యాలు ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

రాజన్న సిరిసిల్ల – ఎల్లారెడ్డి పేట మండలం కిషన్ దాస్ పేట ప్రాథమిక పాఠశాలలో 10 ఏళ్లు పాఠాలు చెప్పిన ఉపాధ్యాయుడు శ్రీనివాస్ పాఠశాల నుండి బదిలీ అయ్యాడు. పిల్లలతో మమేకంగా ఉన్న శ్రీనివాస్ పాఠశాలను విడిచి వెళ్తున్నప్పుడు, విద్యార్థులు మమ్మల్ని వదిలి వెళ్లొద్దు సారూ అంటూ వెక్కి వెక్కి ఏడుస్తూ కన్నీటి పర్యంతమయ్యారు. ఈ దృశ్యాలు చూసి అక్కడున్న టీచర్స్ సైతం కంటతడి పెట్టుకున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. 

 

Published on: Jul 19, 2024 01:27 PM
Loading...
Unable to load recommendations.
Follow Us