కొత్త జంటకు అదిరిపోయే గిఫ్ట్‌ !! ముందెన్నడూ చూసి ఉండరు !!

కొత్త జంటకు అదిరిపోయే గిఫ్ట్‌ !! ముందెన్నడూ చూసి ఉండరు !!

Phani CH

|

Updated on: Apr 19, 2022 | 9:47 PM

పూర్వం వివాహానికి హాజరైన అతిధులకు పెళ్లిలో విశనకర్రలు పంచేవారు.. అదొక గౌరవంగా భావించేవారు. ఇప్పడు ఆ అవసరం లేకుండా ఫంక్షన్‌ హాల్స్‌లో ఏసీలు, ఫ్యాన్స్‌ అందుబాటులోకి వచ్చాయి.


పూర్వం వివాహానికి హాజరైన అతిధులకు పెళ్లిలో విశనకర్రలు పంచేవారు.. అదొక గౌరవంగా భావించేవారు. ఇప్పడు ఆ అవసరం లేకుండా ఫంక్షన్‌ హాల్స్‌లో ఏసీలు, ఫ్యాన్స్‌ అందుబాటులోకి వచ్చాయి. తాజాగా ఆ సంప్రదాయాన్ని మళ్లీ గుర్తుచేసారు కొందరు యువకులు. అసలే వేసవి కాలం.. ఉక్కబోత ఓ వైపు.. మరోవైపు విద్యుత్ కోతలు.. దీంతో ఆంధ్రప్రదేశ్ లోని ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో పెళ్లిళ్లు అంటే సీన్‌ ఎలా ఉంటుందో ఊహించుకోండి. ఈ క్రమంలో కొందరు వ్యక్తులు తమ ఫ్రెండ్‌ పెళ్లికి వినూత్నమైన గిఫ్ట్‌ ఇవ్వాలనుకున్నారు. వెంటనే రెండు తాటాకు విశనకర్రలను కొని అందంగా ప్యాక్ చేయించి వధూవరులకు ప్రజెంట్‌ చేశారు. శ్రీకాకుళం జిల్లా సోంపేట పట్టణంలో జరిగిన సురేష్ వెడ్స్ నందిని వివాహకార్య క్రమంలో మిత్రులు విసనకర్రలు ఇచ్చి అక్కడున్న వారిని ఆశ్చర్య పరిచారు రాష్ట్రంలో పవర్ కట్ పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని సరదాగా ఈ గిఫ్ట్ ఇచ్చినట్లు మిత్రులు తెలిపారు. స్నేహితులిచ్చిన గిప్ట్ ప్యాక్ ను ఓపెన్ చేసిన పెళ్ళికొడుకు పెళ్ళికూతురికి అందులో రెండు విసన కర్రలు కనిపించాయి.

Also Watch:

ఇది కదా ప్రేమంటే !! ఈ వ్యక్తి చేసిన పనికి నెటిజన్లు ఫిదా

Viral Video: ఈ రొయ్య వెరీ స్పెషల్‌ !! ఏం చేస్తుందో చూడండి !!

Viral Video: గొర్రెపిల్లను భయపెట్టాలని చూసిన కోడిపుంజు !! కోడిపుంజు గట్టి ఝలక్‌ ఇచ్చిన తల్లిగొర్రె

Viral Video: తెలివైన కుక్క ఏం చేసిందో చూడండి.. మనుషులనే మించిపోయిందంటున్న నెటిజనం

వ్యక్తి చనిపోయాడని కన్ఫామ్ చేసిన డాక్టర్లు !! అంత్యక్రియలకు ముందు స్నానం చేయిస్తుండగా షాక్ !!