Squirrel Viral Video: తప్పతాగి తూలుతూ, రచ్చ రచ్చ చేసిన ఉడుత మామ.. ఇంత ఎక్కేసిందా..

Updated on: Aug 10, 2022 | 9:20 PM

సాధారణంగా మనుషులు అధికంగా మద్యం సేవించినపుడు తూలిపోతుంటారు. ఇది సహజం.. మరి పొరపాటున జంతువులో పక్షులో మద్యం సేవించాయనుకోండి..


సాధారణంగా మనుషులు అధికంగా మద్యం సేవించినపుడు తూలిపోతుంటారు. ఇది సహజం.. మరి పొరపాటున జంతువులో పక్షులో మద్యం సేవించాయనుకోండి.. వాటి రియాక్షన్‌ ఎలాఉంటుందో ఓ సారి ఊహించుకోండి.. ఊహించుకోడమెందుకు.. చూసేస్తే పోలా.. ఇక్కడ ఓ ఉడుత మద్యం మత్తులో ఊగిపోతున్న వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఆ వీడియో చూసి నెటిజన్లు ఫుల్లుగా నవ్వుకుంటున్నారు.వాస్తవానికి ఈ వీడియోలో ఉడుత నేరుగా మందు తాగలేదు. పులియబెట్టిన పియర్స్ ఫుల్లుగా తినేసింది. ఇవి తినడం వల్ల మత్తు ఎక్కుతుంది. ఉడుత కూడా అదే పరిస్థితిని ఎదుర్కొంది. చెక్కపై పెట్టిన పీయర్స్‌ను దొరికిందే ఛాన్స్‌గా గబగబా తినేసింది. ఆ తరువాత సినిమా నెక్ట్స్ లెవల్‌లో చూపించింది. పాపం, దానికి వెంటనే మత్తెక్కింది. అటూ ఇటూ తులుతూ.. ఓసారి పడుతూ.. మరోసారి లేస్తూ నానా తిప్పలు పడింది. కాగా ఈ ఉడుత ప్రవర్తనను వీడియో తీసిన వారు.. సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దాంతో అదికాస్తా వైరల్ అయ్యింది. ఉడుత తీరును చూసి తెగ నవ్వుకుంటున్నారు నెటిజన్లు. ఈ వీడియోను లక్షలమంది వీక్షిస్తూ ఎంజాయ్‌ చేస్తున్నారు. తమదైనశైలిలో కామెంట్లు పెడుతున్నారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Python-cat: పిల్లిపై కొండచిలువ ఎటాక్‌.. సూపర్‌ షాకిచ్చిన పిల్లి.. వైరల్ అవుతున్న సూపర్ వీడియో..

Cats fight: నడిరోడ్డుపై పిల్లుల ముష్టి యుద్ధం.. మధ్యలో దూరిన కాకి ఏం చేసిందో చూస్తే నవ్వులే..

Published on: Aug 10, 2022 09:19 PM
Loading...
Unable to load recommendations.
Follow Us