Shocking sean: ఆ రూమ్‌లో షాకింగ్ సీన్.. చూస్తే గుండెలు అదరాల్సిందే.. వీడియో చూసేందుకు దైర్యం కావాలి..
వీడియోలో కనిపిస్తున్న దృశ్యం చూస్తే ఎవరికైనా ఒక్కసారిగా వణుకు పుడుతుంది. ఇరుకైన ఓ గదినిండా తేళ్లు నిండిపోయి ఉన్నాయి.
గోడలపై కూడా తేళ్లు ఉన్నాయి. ఇలా వేల సంఖ్యలో విషపూరితమైన తేళ్లు ఉండే ప్రదేశాన్ని మీరు ఎప్పుడూ చూసి ఉండరు. పొరబాటున మనుషులు అటువైపు వెళ్లారో అంతే. ఈ వీడియోను ఎక్కడ తీశారో స్పష్టత లేదు కానీ, అవి అత్యంత ప్రమాదకరమైన డెత్‌స్టాకర్ తేళ్లని అర్థమవుతోంది. ఈ తేళ్ల విషం ఎంతో ఖరీదైనది. ఒక్కో లీటరు 10.5 మిలియన్ డాలర్లు. అంటే దాదాపు 86 కోట్ల 76 లక్షలు అన్నమాట. ఒక్క లీటరు కావాలంటే ఒక తేలు నుంచి దాదాపు 7లక్షల సార్లు గానీ, ఏడు లక్షల తేళ్ల నుంచి ఒక్కసారిగాని విషం తీయాల్సి ఉంటుంది. ఒళ్లు గగుర్పొడిచే ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. ట్విట్టర్‌లో పోస్ట్ చేసిన ఈ వీడియోను 8 మిలియన్లమందికి పైగా వీక్షించారు. లక్షా 31 వేల మందికి పైగా లైక్ చేశారు. అంతేకాదు వీడియోపై రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Rat Job: ఎలుకల్ని పట్టుకుంటే ..రూ. కోటి 38 లక్షల జీతం..! కొత్త పోస్ట్‌కు మేయర్ ప్రకటన..
