Aging: మనుషుల్లో వృద్ధాప్యానికి కారణం ఇదే.. గుర్తించిన శాస్త్రవేత్తలు.!

|

Jul 22, 2024 | 7:01 PM

వార్ధక్యాన్ని జయించాలనేది తరతరాలుగా మనిషి కంటున్న కల. ఆధునిక శాస్త్రసాంకేతిక పరిజ్ఞానంతో ఈ దిశగా పెద్ద ఎత్తున పరిశోధనలు జరుగుతుండగా తాజాగా కీలకమైన ముందడుగు పడింది. వార్ధక్యానికి కారణమయ్యే ఓ కీలక ప్రొటీన్‌ను శాస్త్రవేత్తలు తాజాగా గుర్తించారు. దీన్ని కట్టడి చేసే చికిత్స ద్వారా ఎలుకల జీవితకాలాన్ని ఏకంగా 25 శాతం మేర పెంచగలిగారు. వయసు పెరుగుదలకు ఇంటర్ ల్యూకిన్ - 11 అనే ప్రొటీన్ కారణమవుతోందని సింగపూర్‌లోని డ్యూక్ - ఎన్‌యూఎస్ మెడికల్ స్కూల్ శాస్త్రవేత్తలు గుర్తించారు.

వార్ధక్యాన్ని జయించాలనేది తరతరాలుగా మనిషి కంటున్న కల. ఆధునిక శాస్త్రసాంకేతిక పరిజ్ఞానంతో ఈ దిశగా పెద్ద ఎత్తున పరిశోధనలు జరుగుతుండగా తాజాగా కీలకమైన ముందడుగు పడింది. వార్ధక్యానికి కారణమయ్యే ఓ కీలక ప్రొటీన్‌ను శాస్త్రవేత్తలు తాజాగా గుర్తించారు. దీన్ని కట్టడి చేసే చికిత్స ద్వారా ఎలుకల జీవితకాలాన్ని ఏకంగా 25 శాతం మేర పెంచగలిగారు. వయసు పెరుగుదలకు ఇంటర్ ల్యూకిన్ – 11 అనే ప్రొటీన్ కారణమవుతోందని సింగపూర్‌లోని డ్యూక్ – ఎన్‌యూఎస్ మెడికల్ స్కూల్ శాస్త్రవేత్తలు గుర్తించారు. మనుషుల్లో గుండె, మూత్రపిండాలు, కాలేయం, ఊపిరితిత్తుల పనితీరుపై ఐఎల్‌-11 కీలక ప్రభావం చూపుతోందని గుర్తించారు. వయసుతో పాటు ఈ ప్రొటీన్ ఉత్పత్తి పెరుగుతున్న కొద్దీ కాలేయంలో, పొట్టలో కొవ్వు పేరుకుపోతుందని, కండరాలు బలహీనపడుతున్నాయని వెల్లడించారు. ఇవన్నీ శారీరక దృఢత్వాన్ని తగ్గించి, తద్వారా వయసు పెరుగుదల ప్రక్రియను కొనసాగిస్తున్నాయని తెలిపారు.

ఐఎల్-11 ప్రొటీన్‌ను నిరోధించిన శాస్త్రవేత్తలు ఎలుకల జీవిత కాలాన్ని 25 శాతం మేర పెంచగలిగారు. ఆడ ఎలుకల్లో ఐఎల్-11 నిరోధక చికిత్స ద్వారా శారీరక క్షీణత, వ్యాధులు, బలహీనత, మొదలైన వాటి నుంచి రక్షణ లభించింది. ఇదే చికిత్సతో మగ ఎలుకల జీవితకాలం 22.5 శాతం మేర పెరిగింది. అంతేకాకుండా, ఆరోగ్య సమస్యలు తీసుకొచ్చే తెల్ల కొవ్వు బదులు, క్యాలరీలను ఖర్చు చేసే బ్రౌన్ ఫ్యాట్ ఉత్పత్తి ఎలుకల్లో మొదలైంది. ఈ ఫలితాలపై డ్యూక్ – ఎన్‌యూఎస్ డీన్ ప్రొఫెసర్ సథామస్ కాఫ్‌మన్ స్పందిస్తూ.. ఐఎల్-11 చికిత్సతో వృద్ధులు మరింత ఎక్కువకాలం ఆరోగ్యంగా జీవించడానికి దోహదపడతాయని చెప్పారు. శారీరక దృఢత్వం పెరిగి వృద్ధులు జారి పడే అవకాశాలు తగ్గుతాయని అన్నారు. ప్రపంచవ్యాప్తంగా ప్రజలు ఆరోగ్యవంతమైన దీర్ఘకాలిక జీవితాలు గడిపేలా ఐఎల్-11 చికిత్సను అందరికీ అందుబాటులోకి తీసుకురావాలన్నదే తమ లక్ష్యం అని, ఈ పరిశోధనలో పాలుపంచుకున్న శాస్త్రవేత్త స్టార్ట్‌కుక్ పేర్కొన్నారు. ఈ పరిశోధనకు సంబంధించిన వివరాలు తాజాగా సైన్స్ జర్నల్‌లో ప్రచురితమయ్యాయి.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.

Follow us on