అమ్మ ప్రేమకు భాష లేదు.. కదిలించిన దృశ్యం !!

Updated on: Apr 28, 2026 | 2:02 PM

ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో 40 డిగ్రీల వేసవి తాపానికి ఓ తల్లి కుక్క చూపిన అద్భుత మాతృప్రేమ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. తన కుక్కపిల్ల ఎండవేడికి ఇబ్బంది పడకుండా, నోటితో సున్నితంగా పట్టుకుని నీడ కోసం వెతికింది. కారు నీడలో బిడ్డను భద్రంగా ఉంచి కాపాడిన ఈ దృశ్యం మనుషులకైనా, మూగజీవాలకైనా తల్లి ప్రేమ ఒకటేనని నిరూపించింది. ఈ ఘటన మూగజీవాల పట్ల దయ చూపాలని గుర్తుచేస్తుంది.

వేసవి తాపం మనుషులనే కాదు, మూగజీవాలను కూడా ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. పెద్దింటి వారు AC, కూలర్లతో సేదతీరుతుంటే, వీధిలోని మూగజీవాలు నీడ కోసం తహతహలాడుతున్నాయి. ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో 40 నుంచి 42 డిగ్రీల ఉష్ణోగ్రతలతో జనం అల్లాడుతున్నారు. ఈ పరిస్థితుల్లో ఓ వీధి కుక్క చూపిన మాతృప్రేమ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఎండవేడికి తన బిడ్డ ఇబ్బంది పడుతుందన్న విషయాన్ని గమనించిన ఆ తల్లి శునకం, తన పిల్లను ఎండ నుంచి కాపాడాలని నిర్ణయించుకుంది. వెంటనే ఆ కుక్కపిల్లను తన నోటితో సున్నితంగా కరుచుకుని, నీడ కోసం వీధులన్నీ వెతికింది. చివరకు ఒక ఇంటి ముందు పార్క్ చేసిన కారు నీడలో ఉన్న సురక్షితమైన ప్రదేశంలో బిడ్డను ఉంచి, ఎండ తగలకుండా కంటికి రెప్పలా కాపాడుకుంది. ఈ దృశ్యం చూసిన స్థానికులు ఫిదా అయ్యారు. మనుషులకైనా, మూగజీవాలకైనా మాతృత్వం ఒక్కటేనని, బిడ్డను కాపాడుకునేందుకు తల్లిపడే తపన వర్ణనాతీతమని వారు మురిసిపోయారు. ప్రతి తల్లి తన బిడ్డను రక్షించుకునేందుకు పడే పాట్లు చూస్తుంటే, ‘అమ్మ’ ప్రేమకు భాషతో పని లేదని మరోసారి రుజువైందని చర్చించుకున్నారు. మనుషులం మాత్రమే కాదు, ఈ మూగజీవాల ప్రేమ కూడా ఎంతో గొప్పదని, వాటి పట్ల మనం కూడా కనికరం చూపాలని ఈ ఘటన గుర్తుచేస్తోంది. నిజంగా తల్లి ప్రేమకు సాటి ఏదీ లేదు!

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ముంచుకొస్తున్న సూపర్ ఎల్ నినో.. మానవాళికి డెత్ వారెంట్.. !

పార్క్‌లో వాకింగ్‌ చేస్తున్నారా.. పన్ను కట్టాల్సిందేనా? అసలేం జరిగింది?

తెలుగు రాష్ట్రాల్లో పెట్రో కష్టాలు.. రంగంలోకి దిగిన అధికారులు

122 ఏళ్ల తర్వాత వెలుగులోకి ఒళ్లు గగుర్పొడిచే నిజం! గర్భగుడిలో 1000 ఏళ్ల నాటి రహస్యం

పౌడర్ రాసుకుంటేనే కూలీ.. లేదంటే..!

Follow Us