మ్యాగీ అమ్మి రోజుకు రూ.14 వేలు సంపాదన

Updated on: Nov 09, 2026 | 5:04 PM

హిమాచల్‌ ప్రదేశ్‌లోని రోహ్‌తాంగ్‌ పాస్‌లో ఓ చిన్న మ్యాగీ స్టాల్‌ రోజుకు రూ.14 వేల నుంచి రూ.15 వేల వరకు టర్నోవర్‌ సాధిస్తున్నట్లు వైరల్‌ వీడియో వెల్లడించింది. రోజుకు 60 నుంచి 70 ప్లేట్ల మ్యాగీ, 200 కప్పుల టీ విక్రయిస్తున్నట్లు వ్యాపారి తెలిపాడు. అయితే ఇది మొత్తం అమ్మకాల ఆదాయమే తప్ప నికర లాభం కాదని నెటిజన్లు గుర్తుచేస్తున్నారు. రవాణా, ముడిసరుకుల ఖర్చులు తీసేస్తే అసలు లాభం తెలుస్తుందని వ్యాఖ్యానిస్తున్నారు.

వ్యాపారం చిన్నదా పెద్దదా అనేది కాదు.. దానికి ఎంచుకున్న ప్రాంతం, డిమాండ్ ఎలాంటిదో రోహ్‌తాంగ్ పాస్‌లోని ఒక మ్యాగీ వ్యాపారి నిరూపించాడు. హిమాచల్ ప్రదేశ్‌లోని మంచు కొండల్లో రోడ్డు పక్కన ఉన్న చిన్న మ్యాగీ స్టాల్ యజమాని రోజువారీ సంపాదన వివరాలను ఒక కంటెంట్ క్రియేటర్ సోషల్ మీడియాలో పంచుకోవడంతో అది నెట్టింట చర్చనీయాంశంగా మారింది. ఓ కంటెంట్‌ క్రియేటర్ రోహ్‌తాంగ్ పాస్ పర్యటనలో భాగంగా స్థానిక వ్యాపారితో మాట్లాడి, అతడి రోజువారీ విక్రయాల వివరాలను ఇన్‌స్టాగ్రామ్ వీడియో ద్వారా వెల్లడించారు. పర్యాటకుల రాక చాలా తక్కువగా ఉండే ‘ఆఫ్-సీజన్’లో కూడా ఆ స్టాల్ యజమాని రోజుకు ఏకంగా ₹14,000 నుంచి ₹15,000 వరకు టర్నోవర్ సాధిస్తున్నట్లు తేలింది. వ్యాపారి తెలిపిన వివరాల ప్రకారం.. అతడు రోజుకు 60 నుంచి 70 ప్లేట్ల మ్యాగీని విక్రయిస్తూ దాదాపు రూ. 6 నుంచి రూ. 7 వేలు సంపాదిస్తున్నాడు. అలాగే రోజుకు 200 కప్పుల టీని అమ్ముతూ మరో రూ.8,000 వరకు రాబడుతున్నాడు. ఇవి కాకుండా గుడ్ల విక్రయాల ద్వారా అదనపు ఆదాయం వస్తోంది. సీజన్‌లో ఈ అమ్మకాలు మరిన్ని రెట్లు పెరిగే అవకాశం ఉందని క్రియేటర్ పేర్కొన్నారు. అయితే, ఈ రూ. 14,000 అనేది మొత్తం అమ్మకాలు మాత్రమేనని, అది అతడి నికర లాభం కాదని నెటిజన్లు ఎత్తిచూపుతున్నారు. సముద్ర మట్టానికి అత్యంత ఎత్తులో ఉండే రోహ్‌తాంగ్ పాస్‌కు ముడిసరుకులు రవాణా చేయడం, మైనస్ డిగ్రీల కఠిన వాతావరణంలో రోజంతా పనిచేయడం చాలా వ్యయప్రయాసలతో కూడుకున్న వ్యవహారమని గుర్తు చేస్తున్నారు. రవాణా ఖర్చులు, సరుకుల ధరలు మినహాయించిన తర్వాతే అసలు లాభం ఎంత అనేది తేలుతుందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

దీపావళిని 5 రోజులు ఎందుకు జరుపుకుంటారు?

బెంగళూరు నుంచి హైదరాబాద్‌ 2 గంటలే..

ఐటీ ఉద్యోగుల నయా ట్రెండ్‌.. వర్క్ ఫ్రమ్ పార్క్

నా వనవాసం ఎప్పుడు ముగుస్తుంది? రేణుదేశాయ్‌ కామెంట్స్‌ వైరల్‌

తెరపై నటులు.. కానీ నిజ జీవితంలో దొంగలు

Loading...
Unable to load recommendations.
Follow Us