Ration card Rules: త్వరలో రేషన్ కార్డు నిబంధనల్లో మార్పులు..! కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం..
పేదలకు ఆహార సరుకులు అందించడంలో కీలక పాత్ర పోషించేది రేషన్ కార్డు. రేషన్ కార్డు నుంచి పొందే సరుకులు ఉచితంగా పొందడం వల్ల ఎంతో ఆసరాగా నిలుస్తోంది. కరోనా లాక్‌డౌన్ తర్వాత పేద ప్రజలను ఆదుకోవడం కోసం వారి జీవనోపాధికి ఆసరాగా నిలించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రధాన్ మంత్రి
పేదలకు ఆహార సరుకులు అందించడంలో కీలక పాత్ర పోషించేది రేషన్ కార్డు. రేషన్ కార్డు నుంచి పొందే సరుకులు ఉచితంగా పొందడం వల్ల ఎంతో ఆసరాగా నిలుస్తోంది. కరోనా లాక్‌డౌన్ తర్వాత పేద ప్రజలను ఆదుకోవడం కోసం వారి జీవనోపాధికి ఆసరాగా నిలించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రధాన్ మంత్రి గరీబ్ కల్యాణ్ యోజన(PM-GKY) పథకాన్ని తీసుకువచ్చిన విషయం తెలిసిందే. కాగా ఈ పథకాన్ని సెప్టెంబర్ 2022 వరకు మరో ఆరు నెలల పాటు పొడిగిస్తున్నట్లు ప్రకటించింది కేంద్రప్రభుత్వం. ఇదిలా ఉంటే ఆహార, ప్రజా పంపిణీలో ప్రస్తుతం రేషన్ కార్డు నిబంధనలలో కొన్ని మార్పులు తీసుకువచ్చింది మోడీ సర్కార్. రేషన్ కార్డు అర్హత, మార్పులపై రాష్ట్రాలతో కేంద్రం సమావేశం నిర్వహించనుంది. రేషన్ కార్డు కోసం కొన్ని ప్రమాణాలు మార్పులు చేయనుంది. ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉండే డేటా ప్రకారం.. ప్రస్తుతం 80 కోట్ల మందికిపైగా ప్రజలు జాతీయ ఆహార భద్రతా చట్టం (NFSA) కింద ప్రయోజనాలు పొందుతున్నారు. అయితే వీరిలో ఆర్థికంగా స్థిరంగా ఉన్నవారు కూడా ఉన్నారని, అయినప్పటికీ వారు ఉచిత రేషన్ పథకాన్ని ఉపయోగిస్తున్నారని నివేదికలు వెల్లడిస్తున్నాయి. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం పలు మార్పులు చేసేందుకు సిద్ధమవుతోంది. ఉపాధి కోసం వలస వెళ్లిన వారిని దృష్టిలో ఉంచుకుని ‘ఒకే దేశం, ఒకే రేషన్ కార్డు’ను ప్రారంభించింది. అయితే మునుపటిలా కాకుండా ఇప్పుడు చెల్లుబాటు అయ్యే రేషన్ కార్డును కలిగినవున్న ఎవరైనా దేశంలోని ఏ రాష్ట్రం నుంచి అయినా ఉచితంగా రేషన్ పొందవచ్చు. ఇంతకు ముందు రేషన్ కార్డుదారుని సొంత రాష్ట్రంలో మాత్రమే రేషన్ పొందేందుకు అర్హత ఉండేది. కానీ ఇప్పుడు దేశంలో ఏ రాష్ట్రంలోనైనా పొందే వెసులుబాటు ఉంది.
“మరిన్ని చూడండి ఇక్కడ:
Elephant-Lion: అః.. కుక్క మొరిగితే కొండకు సేట.. ఏనుగుపై సింహం దాడి.. కట్‌చేస్తే.. సీన్ రివర్స్
Viral Video: అవ్వ..! పెళ్లిలో వరుడి స్నేహితుడి నిర్వాకం.. ఏం చేస్తున్నాడో మీరే చూడండి..
Viral Video: వారేవా ఇది కదరా స్నేహమంటే.. దివ్యాంగుడిని భుజాలపై తిప్పిన గర్ల్స్.. వైరల్ వీడియో
Ram Charan-Urfi Javed: రామ్ చరణ్ కు పడిపోయిన.. బాలీవుడ్ శృంగార తార.. ఓపెన్ ఆఫర్ అంటూ ఇలా..
Viral Video: మరికొద్ది క్షణాల్లో పెళ్లి.. మండపంలోకి మాజీ ప్రియుడి ఎంట్రీతో సీన్ రివర్స్..