అరుదైన పాము ప్రత్యక్షం.. తక్షక వంశానికి చెందిన నాగుగా నిర్ధారణ

|

Dec 12, 2024 | 8:34 PM

జార్ఖండ్‌లో అరుదైన నాగు పాము కనిపించింది. మహాభారతంలో చెప్పబడిన తక్షక నాగు కలియుగంలో ప్రత్యక్షమైంది. రాంచీలోని ప్రభుత్వ కార్యాలయంలో కనిపించిన ఈ పామును చూసి అధికారులు ఆశ్చర్యపోయారు. వెంటనే స్నేక్‌ క్యాచర్‌, అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. జార్ఖండ్‌లో ఇలాంటి పాము కనిపించడం ఇదే తొలిసారి అని పాముల సంరక్షణ నిపుణుడు తెలిపారు.

ఈ పాము చాలా విషపూరితమైనదని చెప్పారు. ఈ పాము వయస్సు 12 ఏళ్లు ఉంటుందని అంచనా వేశారు. కాగా, ఈ పాము వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోలో, పాము శరీరం బంగారు ఆభరణంలా మెరుస్తూ కనిపిస్తోంది. ప్రస్తుతం తక్షక్ వీడియో ఇంటర్నెట్‌లో విస్తృతంగా షేర్ చేస్తున్నారు. అదే సమయంలో ఈ అరుదైన నాగుపాము చరిత్ర తెలుసుకుని నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. ఈ తక్షక్‌ జాతికి చెందిన ఈ పాము ద్వాపరయుగం నాటిదని చెబుతున్నారు. ద్వాపర యుగం ముగిసిపోయే సమయంలో భారతదేశాన్ని పరీక్షిత్తుడు అనే రాజు పరిపాలించాడు.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

అమెజాన్‌లో తెలుగు కుర్రాడికి జాక్‌పాట్‌.. ప్యాకేజ్ ఎంతో తెలుసా ??

జానీ మాస్టర్‌కు బిగ్ షాక్.. శాశ్వతంగా దానికి దూరమే !!

గుడ్‌ న్యూస్‌.. తగ్గనున్న పెట్రోల్‌, డీజిల్‌ ధరలు