ఒకప్పుడు ఆటో డ్రైవర్.. ఇప్పుడు నెంబర్ ప్లేట్ కోసం 32 లక్షలు ఖర్చు..
రాజస్థాన్‌కు చెందిన రాహుల్ తనేజ ప్రస్తుతం కోట్లలో సంపాదిస్తున్న ఓ వ్యాపారి. ఒకప్పుడు రాహుల్‌ది నిరుపేద కుటుంబం. మధ్యప్రదేశ్ లోని మండ్ల జిల్లాలో కంత్ర అనే చిన్న గ్రామంలో పుట్టాడు. తండ్రి సైకిల్ రిపేర్ షాపు నడిపేవాడు. తల్లి పొలాల్లో కూలీ పనులు చేసేది. రాహుల్ 11 ఏళ్ల వయసులోనే పని చేయటం మొదలెట్టాడు. రాజస్థాన్‌లోని ఓ దాబాలో సర్వర్‌గా పని చేశాడు.
రాజస్థాన్‌కు చెందిన రాహుల్ తనేజ ప్రస్తుతం కోట్లలో సంపాదిస్తున్న ఓ వ్యాపారి. ఒకప్పుడు రాహుల్‌ది నిరుపేద కుటుంబం. మధ్యప్రదేశ్ లోని మండ్ల జిల్లాలో కంత్ర అనే చిన్న గ్రామంలో పుట్టాడు. తండ్రి సైకిల్ రిపేర్ షాపు నడిపేవాడు. తల్లి పొలాల్లో కూలీ పనులు చేసేది. రాహుల్ 11 ఏళ్ల వయసులోనే పని చేయటం మొదలెట్టాడు. రాజస్థాన్‌లోని ఓ దాబాలో సర్వర్‌గా పని చేశాడు. మకర సంక్రాంతి, దీపావళి, హోలీకి రంగులు, గాలి పటాలు అమ్మేవాడు. ఐదేళ్లలో చాలా రకాల పనులు చేశాడు. 16 ఏళ్ల వయసులో ఆటో నడిపాడు. 19 ఏళ్ల వయసులో తన సేవింగ్స్‌తో కార్ డీలర్ షిప్ తీసుకున్నాడు. రాహుల్ తనేజ.. మోడలింగ్ కూడా మొదలెట్టాడు. మిస్టర్ జైపూర్, మిస్టర్ రాజస్థాన్ టైటిల్స్ గెలుచుకున్నాడు. 2000 సంవత్సరంలో ఈవెంట్ మేనేజ్‌మెంట్ కంపెనీ, ఆ తర్వాత విలాసవంతుల వివాహాలకు ప్లానింగ్ చేయడం మొదలెట్టాడు. తను అడుగుపెట్టిన ప్రతీ రంగంలో విజయం దక్కింది. కోట్లు సంపాదించాడు. రాహుల్‌కు లగ్జరీ కార్లన్నా, ఫ్యాన్సీ నెంబర్లు అన్నా పిచ్చి. 2011లో తన బీఎమ్‌డబ్ల్యూ కారు నెంబర్ ప్లేట్ కోసం 10 లక్షలు ఖర్చు పెట్టాడు. 2018లో జాగ్వార్ కారు నెంబర్ ప్లేట్ కోసం 16 లక్షలు ఖర్చు పెట్టాడు. ఇప్పుడు తన కొడుకు కోసం కొన్న ఆడీ కారు నెంబర్ ప్లేట్ కోసం ఏకంగా 32 లక్షలు ఖర్చు పెట్టాడు. ఆ కారును తన కొడుకు 18వ పుట్టినరోజు నాడు గిఫ్ట్‌గా ఇవ్వనున్నాడు. పుట్టిన రోజు గిఫ్ట్‌గా కారును, కారుతో పాటు వీఐపీ నెంబర్‌ను ఇస్తున్నాడు. ‘ఎక్కు తొలిమెట్టు .. కొండను కొట్టూ ఢీకొట్టు’ అని నరసింహ సినిమాలో ఓ పాట ఉంది. ఆ పాట పూర్తయ్యేలోగా రజనీకాంత్ మల్టీ బిలియనీర్ అయిపోతాడు. నిజ జీవితంలో ఇలా జరుగుతుందా అంటే జరుగుతుంది. అందుకు ఉదాహరణే మనం ఇప్పుడు చెప్పుకున్న రాహుల్ తనేజా. కానీ, దానికి కొన్నేళ్ల శ్రమ కావాలి. గట్టిగా అనుకుంటే హోటల్‌లో సర్వర్ కూడా కోటీశ్వరుడు కావచ్చు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Safety Pin: పిన్నీసు ధర రూ. 69 వేలు ??
బ్రో.. ఈ మేకను తీసుకొని.. ఆలుగడ్డలివ్వు..
నానబెట్టిన బాదంను నెలపాటు తినండి.. అదిరిపోయే మార్పులు చూస్తారు
ఇంటి ముందు డ్రైన్‌లో వింత శబ్ధాలు.. తొంగి చూస్తే షాకింగ్ సీన్
