కత్తితో కారు దిగిన మహిళ.. కారు పైకి కోడిగుడ్లు విసిరిన దుండగులు

Updated on: Feb 26, 2026 | 1:41 PM

పంజాబ్‌లో హర్జింద్ కౌర్ అద్భుత ధైర్యం చూపారు. లూధియానాలో కారులో వెళ్తుండగా, దొంగలు కోడిగుడ్లు విసిరి ఆపాలని చూశారు. ఆమె భయపడకుండా కిర్పాన్ కత్తితో వారిని ఎదుర్కొన్నారు. దొంగలు బైక్ వదిలి పారిపోయారు. ఈ వీడియో వైరల్ కావడంతో పోలీసులు చర్యలు తీసుకున్నారు. హర్జింద్ కౌర్ సాహసాన్ని ప్రశంసిస్తూ, "కోడిగుడ్ల గ్యాంగ్‌" పట్ల అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచించారు.

పంజాబ్‌లో ఓ మహిళ దొంగలకు చుక్కలు చూపింది. ఆస్ట్రేలియాలో నివసించే హర్జింద్ కౌర్ ఇటీవల పంజాబ్‌కు వచ్చారు. తన అత్త, అమ్మమ్మతో కలిసి లూధియానాలోని బంధువుల ఇంటికి కారులో వెళ్తుండగా ఘటన జరిగింది. హర్జింద్‌ కౌర్‌ కారు డ్రైవింగ్‌ చేస్తుండగా నిర్మానుష్య ప్రదేశంలో బైక్‌పై వచ్చిన ఇద్దరు వ్యక్తులు వారి కారును వెంబడించారు. కాసేపటికే కారు ముందు అద్దంపై కోడిగుడ్లు విసిరారు. అద్దం సరిగా కనిపించక కారు ఆపితే దోచుకోవాలన్నది దొంగల పథకం. అయితే, హర్జింద్ కౌర్ ఏమాత్రం భయపడలేదు. వెంటనే కారులో ఉన్న కిర్పాన్ కత్తిని తీసుకుని కిందకు దిగి, వారిపైకి దూసుకెళ్లారు. ఊహించని ఈ పరిణామానికి దొంగలు షాకై, ప్రాణభయంతో బైక్‌ను కూడా వదిలేసి పారిపోయారు. కారులో ఉన్న ఆమె అత్త ఈ ఘటనను తన ఫోన్‌లో వీడియో తీశారు. ఈ వీడియో వైరల్ కావడంతో పోలీసులు రంగంలోకి దిగారు. ఘటనపై కేసు నమోదు చేసి, ఇద్దరు అనుమానితులను అదుపులోకి తీసుకున్నట్లు లుధియానా పోలీసులు తెలిపారు. హర్జింద్ కౌర్ ధైర్యాన్ని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. ఇలాంటి “కోడిగుడ్ల గ్యాంగ్” పట్ల ప్రయాణికులు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు.ఈ సాహసోపేత ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Vijay-Rashmika Marriage: ‘విరోషి’ పెళ్లిలో.. ఘుమ ఘుమలాడే వంటకాలు

Anvesh: ‘నా అన్వేష్‌కు లుక్‌ అవుట్ నోటీసులు’ నోరు అదుపులో లేకపోతే ఇంతే

Vijay-Rashmika Marriage: పైసా వసూల్ పెళ్లి ?? భారీ ధరకు విరోషి పెళ్లి రైట్స్‌

‘ఆ ఇద్దరి గురించి నోరు జారాడు..’ పాపం !! అడ్డంగా దొరికిన తమన్

Vijay-Rashmika Marriage: రష్మికకి అత్తామామలు పెట్టిన.. కండీషన్‌ ఏంటంటే..

Follow Us