గర్భవతులను చేయండి.. లక్షలు సంపాదించండి..!

Updated on: Jan 17, 2025 | 1:41 PM

మోసపోయే వాళ్లు ఉన్నంతకాలం మోసం చేసేవాళ్లు పుట్టుకొస్తూనే ఉంటారు. రోజు రోజుకూ పెరుగుతున్న టెక్నాలజీని మోసగాళ్లు తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారు. రోజుకో కొత్త ఎత్తుగడతో బలహీనతలను క్యాష్‌ చేసుకుంటున్నారు. ఇప్పటి వరకూ హనీట్రాప్‌, లోన్‌ యాప్‌, డిజిటల్‌ అరెస్ట్‌ లాంటి మోసాలతో సైబర్‌ నేరగాళ్లు జనాలను మోసం చేస్తున్నారు.

ఇప్పుడు మరో నయా మోసానికి తెరలేపారు. గర్భవతులను చేస్తే లక్షలు ఇస్తామని ప్రకటనలు చేసి అమాయకులకు గాలం వేస్తూ భారీగా డబ్బు వసూలు చేస్తున్నారు. బిహార్‌లో ఏకంగా ఓ ముఠా..సంతానం లేని స్త్రీలను గర్భవతులను చేస్తే భారీ మొత్తంలో డబ్బు సంపాదించవచ్చని ప్రకటనలు గుప్పించి బాధితుల నుంచి భారీగా డబ్బు వసూలు చేసింది. ఈ తరహా మోసాలపై పోలీసులకు ఫిర్యాదులు అందడంతో దర్యాప్తు చేపట్టి ముఠా సభ్యులు పలువురిని అరెస్టు చేశారు. నవడా జిల్లాలో ఈ స్కామ్‌ బయటపడింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ‘ఆల్‌ ఇండియా ప్రెగ్నెంట్‌ జాబ్‌ సర్వీస్‌’, ‘ప్లేబాయ్‌ సర్వీస్‌’ల పేరిట ఫేస్‌బుక్‌లో ఈ ముఠా సభ్యులు ప్రకటనలు ఇచ్చారు. పిల్లలు లేని స్త్రీలను గర్భవతులను చేస్తే రూ.10 లక్షలు పొందవచ్చని ప్రకటించారు.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Saif Ali Khan: సైఫ్ అలీఖాన్ ఆస్తులు తెలిస్తే షాకవుతారు

3 రోజులు.. 6 కోట్లు.. కుంభమేళాకు పోటెత్తిన భక్తులు

హమ్మయ్య..యుద్ధం ఆగింది.. ఇక మోదీ కల నెరవేరినట్టే

రూ.100 కోట్లు కొల్లగొట్టిన డాకు.. బాలయ్యే కింగ్ ఆఫ్ సంక్రాంతి..

Saif Ali Khan: సైఫ్‌ అలీఖాన్‌పై దుండగుడి దా*డి.. 6 చోట్ల క*త్తిపోట్లు