Andhra Pradesh: చేపల కోసం చెరువులోకి వల వేసాడు.. దొరికింది చూసి స్టన్ అయ్యాడు..

Updated on: Apr 15, 2026 | 8:07 PM

ఆంధ్రప్రదేశ్‌లోని అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరు ఏజెన్సీలో షాకింగ్ ఘటన వెలుగుచూసింది. ఏడుగురాళ్లపల్లి చెరువులో చేపల వలకు వందల సంఖ్యలో పాన్, ఏటీఎం కార్డులు చిక్కాయి. ఇవి స్థానిక గ్రామాల ప్రజలకు చెందినవిగా గుర్తించారు. డెలివరీ చేయకుండా పోస్టల్ సిబ్బంది నిర్లక్ష్యంగా పడేసి ఉంటారని స్థానికులు అనుమానిస్తున్నారు. ఉన్నతాధికారులు తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

ఆంధ్రప్రదేశ్‌లోని అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరు ఏజెన్సీలో షాకింగ్ ఘటన జరిగింది. ఏడుగురాళ్లపల్లి గ్రామంలోని చెరువులో చేపల వలకు వందల సంఖ్యలో పాన్ కార్డులు, ఏటీఎం కార్డులు చిక్కాయి. స్థానికులు చేపలు పట్టేందుకు వల వేయగా, భారీగా చేపలకు బదులు 150 నుంచి 200 వరకు కార్డులు వలలో పడటంతో ఆశ్చర్యపోయారు. ఈ కార్డులన్నీ చుట్టుపక్కల గ్రామాలకు చెందిన కస్టమర్లకు డెలివరీ కావాల్సినవిగా గుర్తించారు. గతంలోనూ ఆంధ్రప్రదేశ్‌తో పాటు ఇతర రాష్ట్రాల్లో ఆధార్, పాన్, ఓటర్ ఐడీ కార్డులను డెలివరీ చేయకుండా పడేసిన ఘటనలు అనేకం జరిగాయి. అదే తరహాలో పోస్టల్ సిబ్బంది తమ నిర్లక్ష్యం కారణంగా ఈ కార్డులను చెరువులో పడేసి ఉంటారని స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Singer Mangli Case: సింగర్ మంగ్లీ కేసులో బిగ్ ట్విస్ట్

Hyderabad: నిజాం నగల పేరుతో మోసం.. పోలీసుల దర్యాప్తు

POCSO Case: 108 మంది బాలికలపై లైంగిక వేధింపులు

ఏపీ రాజధాని అమరావతి పేరు ఇంగ్లీష్ లో ఎలా రాయాలనే దానిపై AP సర్కార్ క్లారిటీ

పెళ్లికి ఒప్పుకోలేదని.. నా కూతురుకి HIV ఎక్కించాడు

Published on: Apr 15, 2026 08:02 PM
Follow Us