రోబోను చూసి అడవి పందులు పరార్.. హైటెక్‌ ప్లాన్‌ అదిరిందిగా

Updated on: Apr 18, 2026 | 12:11 PM

అడవుల్లో ఆహారం లేక వన్యప్రాణులు నగరాల్లోకి చొరబడి భయాందోళన కలిగిస్తున్నాయి. ఈ సమస్యను ఎదుర్కొనేందుకు పోలాండ్ వినూత్న పరిష్కారం కనుగొంది. అక్కడి అధికారులు 'ఎడ్వర్డ్' అనే హ్యూమనాయిడ్ రోబోను ఉపయోగించి అడవి పందులను సురక్షితంగా తరిమికొట్టారు. ఇది వన్యప్రాణులకు హాని చేయకుండా, మానవులకు ప్రమాదం లేకుండా సమస్యను పరిష్కరించింది. భవిష్యత్తులో మరిన్ని రోబోలను మోహరించాలని పోలాండ్ యోచిస్తోంది.

ఇటీవల అడవుల్లో ఆహారం, నీళ్లు దొరక్క వన్యప్రాణులు జనావాసాల్లోకి చొరబడటం పరిపాటిగా మారింది. ఈ క్రమంలో పశువులు, మనుషులపై కూడా దాడులకు పాల్పడిన ఘటనలూ ఉన్నాయి. గ్రామీణ ప్రాంతాల్లోనే కాకుండా నగరాల్లోకీ చొరబడుతూ జనాలను భయాందోళనకు గురిచేస్తున్నాయి వన్యమృగాలు. అయితే ఇలా జనావాసాల్లోకి చొరబడుతున్న వన్యమృగాలను తరిమి కొట్టేందుకు పోలాండ్‌ దేశంలో అదిరిపోయే హైటెక్‌ ప్లాన్‌ వేశారు. నగరంలోకి చొరబడుతున్న అడవి పందుల గుంపును చెల్లాచెదురు చేయడానికి ఒక హ్యూమనాయిడ్ రోబోను రంగంలోకి దించి వార్తల్లో నిలిచింది ఆదేశం. పోలాండ్‌లోని గడినియా వంటి తీరప్రాంత నగరాల్లో ఇటీవల అడవి పందుల సంచారం విపరీతంగా పెరిగింది. ఆహారం కోసం ఇవి నివాస ప్రాంతాలు, పార్కుల్లోకి చొరబడి ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. ఈ క్రమంలో, అధికారులు ‘ఎడ్వర్డ్’ అనే హ్యూమనాయిడ్ రోబోను ప్రయోగించారు. మనిషి ఆకారంలో, రెండు కాళ్లపై నడుస్తూ పందుల గుంపు వైపు ఎడ్వర్డ్ వెళ్లగానే.. ఆ వింత యంత్రాన్ని చూసిన పందులు భయంతో తోక ముడిచి పారిపోయాయి. రోడ్డు పక్కన పచ్చిక మేస్తున్న పందులను ఎడ్వర్డ్ వెంటపడి తరుముతుంటే వెనక్కి తిరిగి చూడకుండా అడవిపందులు పరుగులు తీసిన దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. టెక్నాలజీ అంటే ఇలా ఉండాలి అంటూ నెటిజన్లు అధికారులను ప్రశంసిస్తున్నారు. వన్యప్రాణులకు ఎటువంటి హాని కలగకుండా, అలాగే మనుషులు ప్రమాదంలో పడకుండా ఇలాంటి రోబోలను వాడటం అద్భుతమైన ఆలోచన అని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. కాగా, ఈ ప్రయోగం విజయవంతం కావడంతో, భవిష్యత్తులో నగరాల్లో వన్యప్రాణుల సమస్యను ఎదుర్కోవడానికి మరిన్ని ‘ఎడ్వర్డ్’ వంటి రోబోలను మోహరించే దిశగా పోలాండ్ అడుగులు వేస్తోంది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఒక్కరోజు వయసున్న క్యూట్ ‘రైనో’.. నెట్టింట హల్చల్ చేస్తున్న వీడియో

ఇవి పనసకాయలా.. మామిడికాయలా.. విరగకాసిందిగా

పెట్రోల్‌ బంకుల్లో ఎయిర్‌ కూలర్లు.. అమ్మడానికి కాదండోయ్‌

పాక్‌లో ఉగ్రవాదుల హత్యలు.. మోటార్‌సైకిళ్లపై వచ్చి కాల్పులు

Monalisa Bhosale: రక్షణ కోరుతూ కేరళం సీఎంకు మోనాలిసా లేఖ

Follow Us