Viral Video: పెళ్లి పీటలపై వధూవరుల పబ్జి.. ఇదేం పని రా సామీ…!! వీడియో
కరోనా వ్యాప్తి నేపథ్యంలో కొద్దిమంది బంధుమిత్రుల సమక్షంలోనే వివాహాలు జరుగుతున్నాయి. అయితే ఈ సమయంలో కొందరు యువతీయువకులు తమ వివాహాలను భిన్నంగా..
కరోనా వ్యాప్తి నేపథ్యంలో కొద్దిమంది బంధుమిత్రుల సమక్షంలోనే వివాహాలు జరుగుతున్నాయి. అయితే ఈ సమయంలో కొందరు యువతీయువకులు తమ వివాహాలను భిన్నంగా.. కొత్త తరహాలో చేసుకుంటున్నారు. ఇక తాజాగా అలాంటి ఓ వెరైటీ కాన్సెప్ట్‌తోనే ఒక్కటైంది ఓ జంట. పెళ్లిపీటలపై కూర్చుని ఉన్న వధువరులు.. ఫోన్‌లో గేమ్ ఆడుతూ బిజీగా ఉన్న వీడియో నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. పశ్చిమబెంగాల్‌కు చెందిన వధూవరులు మొబైల్ ఫోన్‌లలో ఫ్రీ ఫైర్ గేమ్ ఆడారు. శత్రువులను చంపుతూ, నవ్వుకుంటూ.. మాట్లాడుకుంటూ నానా రచ్చ చేశారు. ఇక ఈ వీడియో చూసిన కొందరు నెటిజన్లు ఫన్నీగా కామెంట్లు చేస్తుండగా.. మరికొందరు నెటిజన్స్ మాత్రం వారిని తిట్టి పోస్తున్నారు. ఫోన్లు ఎంతటి దారుణ పరిస్థితులకు తీసుకువచ్చిందో చూడండి అంటూ కామెంట్స్ చేశారు.
మరిన్ని ఇక్కడ చూడండి: Viral Video: వీర్యం నింపిన సిరంజితో మహిళపై ఎటాక్..!! నిందితుడి ఇంటి నుంచి సిరంజిలు స్వాధీనం.. వీడియో