పంది తెచ్చిన ప్రమాదం.. అరక్షణంలో అంతా జరిగిపోయింది..

Updated on: Sep 06, 2022 | 9:04 PM

రోడ్డుపై వెళ్లేప్పుడు చాలా అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే ప్రమాదం అనేది ఏ క్షణం ఏరూపంలో ఎదురవుతుందో ఊహించలేం. ఒక్కోసారి మనం ఎంత జాగ్రత్తగా ఉన్నా..

రోడ్డుపై వెళ్లేప్పుడు చాలా అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే ప్రమాదం అనేది ఏ క్షణం ఏరూపంలో ఎదురవుతుందో ఊహించలేం. ఒక్కోసారి మనం ఎంత జాగ్రత్తగా ఉన్నా.. భారీ మూల్యం చెల్లించాల్సిన పరిస్థితులు ఎదురవుతాయి. ఇప్పుడు మీరు చూడబోతున్న వీడియో కూడా అలాంటిదే.. ఓ పంది కారణంగా క్షణాల్లో ఊహించని ప్రమాదం జరిగిపోయింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇంటర్నెట్‌లో వైరల్‌ అవుతూ నెటిజన్లను అలర్ట్‌ చేస్తుంది. అంబేద్కర్ కోనసీమ జిల్లా లో ఓ బైకర్‌కి సడన్‌గా పంది అడ్డం వచ్చింది. దాన్ని గమనించి బ్రేక్‌ వేసేలోపే ప్రమాదం జరిగిపోయింది. బైక్‌పై ఉన్న వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. ఆస్పత్రి పాలయ్యాడు. పంది మాత్రం లేచి నిదానంగా వెళ్లిపోయింది. రాజోలు మండలం కడలి గ్రామంలో జరిగింది ఈ ఘటన. ఊళ్లో పదుల సంఖ్యలో పందులు స్వైరవిహారం వల్ల అనేక ఇబ్బందులు కలుగుతున్నాయని స్థానికులు చెప్తున్నారు. ఫిర్యాదు చేసినా పట్టించుకునేవారు లేరంటున్నారు. ఉన్నపలంగా వచ్చి వాహనాలకు అడ్డంగా పడడంతో ప్రమాదాలకు గురవుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఆహార ప్రియులకు గుడ్ న్యూస్ !! దేశంలో ఎక్కడి ఫుడ్ అయినా ఆర్డర్‌ చేయొచ్చు !!

రూ.2లక్షలతో మొదలై రూ.75కోట్లకు ఎదిగిన ముగ్గురు మిత్రులు !!

పెళ్లి మండపంలో తండ్రిని చితకబాదిన కన్న పిల్లలు !! ఎందుకో తెలిస్తే షాకే

Viral Video: పులికే చుక్కలు చూపించిన ఎద్దు.. మామూలుగా లేదుగా !!

తలుపులకు శిలువ గుర్తులు !! దెయ్యం భయంలో ఆ గ్రామస్థులు

Published on: Sep 06, 2022 09:04 PM
Loading...
Unable to load recommendations.
Follow Us